అనుకోనేలేదుగా కల కానేకాదుగా
కలిసొచ్ఛే కాలమల్లే నిలిచావులే
అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
సుఖాలన్నీ.. మన చుట్టూ చేరెనే
శుభాలన్నీ.. మన చుట్టమయ్యే నేడే
ఐదు ప్రాణాల సాక్షిగా నాల్గు కాలాల సాక్షిగా
మూడు పుటల్లో రెండు గుండెల్లో ఒక్కటే ప్రేమగా
కొంటె దూరాలు కొద్దిగా కంటి నేరాలు కొద్దిగా
కొన్ని కౌగిళ్లు కొత్త ఎంగిళ్ళు ప్రేమగా మారగా
ఉల్లాసమే ఉద్యోగమాయె సంతోషమే సంపాదనాయే
ఇదే బాటై ఇదే మాటై ఇలాగే లోకాన ఏలాలిలే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే నవ్వు ఒకే నడక మరో జగమైతే మనమేలే
అనుకోనేలేదుగా కల కానేకాదుగా
కలిసొచ్ఛే కాలమల్లే నిలిచావులే
నువ్ అనుకుంటే చాలుగా కనువిందే చేయగా
కదిలొచ్చే తీరమల్లే కలిశా నేనే
ఒకే నువ్వు ఒకే నేను చెరో సగమైతే ప్రేమేలే
ఒకే చూపు ఒకే శ్వాస మరో జగమైతే మనమేలే
________________
Song Credits:
పాట: అనుకోలేదుగా (Anukoneledhugaa)
చిత్రం: పంజా (Panjaa)
నటీనటులు: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సారా-జేన్ డయాస్ (Sarah-Jane Dias)
సంగీత దర్శకుడు: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
గీత రచయిత: చంద్రబోస్ (Chandrabose)
గాయకులు: ప్రియా హిమేష్ (Priya Himesh), బెల్లి రాజ్ (Belly Raj)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.