అన్నావులేదో.. నువ్వలా ఆ మాటా
అంటే అదేదో.. అద్భుతం అనుకుంటా
విన్నావులేదో.. నా మనసులోమాటా
వింటే నిజంగా నమ్మలేననుకుంటా
అరే అంత మాటా ఇదంచిందా సంగతా
కాల్వచ్చి నీలా ఎదురైందా
అంతే కదా మరీ వింతేమీ ఉన్నదీ
సరి కొత్త ప్రేమ సంతకం ఇదీ
అవునా సరే మరీ అంటూనే నా మాదీ
గమ్మత్తు మత్తులోనే ఉన్నదీ
ప్రతీ రోజు నడిచే దారే ఇదీ
ఇవ్వాలేంటి పొంగే రాయినదీ
నా తోవ చూపే నేలెయిదీ
నాతోనూ ఉంటె గాలయినదీ
చినుకల్లే తాకుతున్న చిన్న ముచ్చటా
చెవిలో ఎం చెప్పి నన్ను లాగుతోందటా
ఇలా తరుముతుంటే తుఫానంటి తొందరా
ఎలా తెలుస్తుందంటా ఎదురేముందో
అంతే కదా మరీ వింతేమీ ఉన్నది
సరి కొత్త ప్రేమ సంతకం ఇదీ
అవునా సరే మరీ అంటూనే నా మాదీ
గమ్మత్తు మత్తులోనే ఉన్నదీ
స్థిరం లేని పరుగే నా వయసుదీ
కదల్లేక నీకై నిలుచున్నదీ
ఎదో కాస్త సరదా అనుకున్నది
వదల్లేని బంధం అవుతున్నది
వరమల్లే అందుకున్న సంపదా ఇదీ
నిలువెల్లా అల్లుకున్న సంకెళ్లా ఇదీ
హే సమర్పించుకొని జతే లేని జన్మనీ
సగం పంచుకొని నా ప్రాణాన్నీ
అంతే కదా మరీ వింతేమీ ఉన్నదీ
సరి కొత్త ప్రేమ సంతకం ఇదీ
అవునా సరే మరీ అంటూనే నా మాదీ
గమ్మత్తు మత్తులోన ఉన్నదీ
అంతే కదా మరీ…
అవునా సరే మరీ…
ఇ….
అవునా సరే మరీ…
__________________
పాట : అంతే కదా మరి (Anthe Kada Mari)
చిత్రం: లవర్ (Lover)
నిర్మాత: హర్షిత్ రెడ్డి (Harshith Reddy)
దర్శకుడు: అనీష్ కృష్ణ (Anish Krishna)
సంగీతం: అంకిత్ తివారీ (Ankit Tiwari)
లిరిక్స్ : సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Seetharama Sastry)
గాయకులు: అంకిత్ తివారీ (Ankit Tiwari), జోనితా గాంధీ (Jonita Gandhi)
నటీనటులు : రాజ్ తరుణ్ (Raj Tarun), రిద్ధి కుమార్ (Riddhi Kumar)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.