Home » అంతలో రామయ్య లేచినాడు (రామా కనవేమిరా) Song Lyrics స్వాతిముత్యం

అంతలో రామయ్య లేచినాడు (రామా కనవేమిరా) Song Lyrics స్వాతిముత్యం

by Lakshmi Guradasi
0 comments
Anthalo ramaya lechinadu song lyrics

రామా కనవేమిరా.. రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా.. రామా కనవేమిరా
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని
సభాసదులందరు పదే పదే చూడగా శ్రీరామ చంద్రమూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు
రామా కనవేమిరా.. రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా.. రామా కనవేమిరా

ముసిముసి నగవుల రసిక శిఖామణులు సానిదమ పమగరిస
ఒసపరి చూపుల అసదుష విక్రములు సగరిద మని ద మ ని ని
ముసిముసి నగవుల రసిక శిఖామణులు త తకిట తక జణుత
ఒసపరి చూపుల అసదుష విక్రములు తకజణు తకధిమి తక
మీసం మీటే రోష పరాయణులు నీ ద మ ప మ స రి గ
మా సరి ఎవరను మత్త గుణొల్వణులూ ఆహ
క్షణమే ఒక దినమై నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివ ధనువు వంక
తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా కనవేమిరా

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు ఓ వరులు
తొడగొట్టి ధనువు చేపట్టి బావురని గుండెలు జారిన విభులు
అహ గుండెలు జారిన విభులు
విల్లెత్తాలేక మొగమెత్తాలేక సిగ్గేసిన నరకుండవులు
తమ వళ్ళు వొరిగి రెండు కళ్ళు తిరిగి వొగ్గెసిన పురుషత్గణులు
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అరెరె ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
అహ ఎత్తే వారు లేరా అ విల్లు ఎక్కు పెట్టే వారు లేరా
తకద తైయ్యకు తా దిమి తా..

రామాయ రామభధ్రాయ రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
అంతలో రామయ్య లేచినాడు ఆ వింటి మీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు సీతవంక ఓరకంట చూసినాడు
ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
పెళ పెళ పెళ పెళ పెళ పెళ పెళవిరిగెను శివధనస్సు
కళలొలికెను సీతా నవవధువు
జయజయరామ రఘుకుల సోమా.. జయజయరామ రఘుకుల సోమా
దశరధ రామా దైత్యవిరామ.. దశరధ రామా దైత్యవిరామ
జయజయరామ రఘుకుల సోమా.. జయజయరామ రఘుకుల సోమా
దశరధ రామా దైత్యవిరామ.. దశరధ రామా దైత్యవిరామ

సీతాకల్యాణ వైభొగమే.. శ్రీరామ కల్యాణ వైభొగమే
సీతాకల్యాణ వైభొగమే.. శ్రీరామ కల్యాణ వైభొగమే
కనగ కనగ కమనీయమే.. అనగ అనగ రమనీయమే
కనగ కనగ కమనీయమే.. అనగ అనగ రమనీయమే
సీతాకల్యాణ వైభొగమే.. శ్రీరామ కల్యాణ వైభొగమే
రామయ్య అదుగోనయ్య
రమణీ లలామ నవ లావణ్య సీమ
ధరాపుత్రి సుమ గాత్రి
ధరాపుత్రి సుమ గాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా.. రామా కనవేమిరా
శ్రీ రఘురామ కనవేమిరా.. రామా కనవేమిరా

Song Credits:

పాట : రామ కనవ్ ఎమిరా
చిత్రం: స్వాతి ముత్యం
గాయకులు: S.P. బాల సుబ్రమణ్యం గారు
లిరిసిస్ట్: సి నారాయణ రెడ్డి గారు
కంపోజర్: ఇళయరాజా గారు
దర్శకుడు: కె. విశ్వనాథ్ గారు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.