Home » మరికొద్ది రోజుల్లో వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..

మరికొద్ది రోజుల్లో వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్..

by Shalini D
0 comment

వాట్సాప్ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇప్పుడు వాట్సాప్ యూజర్లకు త్వరలో చాలా ఉపయోగకరమైన ఫీచర్ రాబోతోంది. నివేదికల ప్రకారం కంపెనీ ఇప్పుడు ఫైల్ షేరింగ్ ఫీచర్‌పై పనిచేస్తోంది. ఇది వినియోగదారులు ఇంటర్నెట్ లేకుండా సమీపంలోని వ్యక్తులతో పెద్ద ఫైళ్లను పంచుకోవడానికి అనుమతిస్తుంది.

వాట్సాప్ కొత్త ఫీచర్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డబ్ల్యుఎబెటాఇన్ఫో తన నివేదికలో ఈ ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. రాబోయే పీపుల్ నియ‌ర్‌బై ఫీచర్ ఐఓఎస్‌ యాప్‌లో భవిష్యత్తులో అప్‌డేట్ కోసం రావొచ్చు. ఫైళ్లను సులభంగా పంపవచ్చు, స్వీకరించవచ్చు. ఇందులో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, మరెన్నో ఉండవచ్చు.

మరికొన్ని రోజుల్లో: వాట్సాప్ పిపుల్ నియర్‌పై ఫీచర్ ఆండ్రాయిడ్ నుండి ఐఓఎస్ వరకు అన్ని ప్లాట్‌ఫామ్‌లలో సపోర్ట్ చేయగలదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను కలిగి ఉంటుంది. తద్వారా రిసీవర్ మాత్రమే సమాచారాన్ని యాక్సెస్ చేయగలడు. అయితే ఈ ఫీచర్ ఇంకా ప్రారంభ దశలోనే ఉందని గుర్తుంచుకోండి. ఫైళ్లను షేర్ చేసుకునే విధానాన్ని కూడా కంపెనీ మార్చవచ్చు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టెక్నాలజీ  ను సందర్శించండి.

You may also like

Leave a Comment