ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు
నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు
చిరునమ్మకమిస్తే చాలు
నీ నమ్మిన బంటవుతాడు
తన ఊపిరి వంతెన చేసి
పెను కడలిని దాటిస్తాడు
నీ తెల్లని మనసుకు
చల్లని చూపుల దీవెనలిస్తాడు
ఆంజనేయుడు నీవాడు
నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు
నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు
నీతోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు
నీతోడై గెలిపిస్తాడు
ఎందుకా కంగారు
ఓద్దులే బంగారు
నిప్పులాంటి ఆశయాన్ని
ఆంటదు ఏ కీడు
మనసులో కన్నీరు
తలచిన తనవారు
తరిగిపోయే రగిలిపోయే
తోడు నీకున్నాడు
సాయమంటే ఆయువిచ్చే
వాయుపుత్రుడు వీడు
గుండె గుడిలో నిన్ను కాచే
కండ గల మొనగాడు
మాటిస్తే తప్పని వాడు
నిన్ను మనవాడు అనుకున్నాడు
నీ కల నెరవేర్చే కర్తవ్యంగా
ముందడుగు ఏసాడు
ఆంజనేయుడు నీవాడు
నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు
నీతోడై గెలిపిస్తాడు
సైన్యము అతడే రా
ధైర్యము అతడే రా
స్వామి కార్యం మర్చిపోని
ధర్మము తనదేరా
నీ కన్నులు వెలిగేదాకా
తన కంటికి లేదే నిద్దుర
జయ హనుమ అనుకో
నీ చిరునవ్వుకు
హామీ తనప్రేమ.. ఆహ్
ఆంజనేయుడు నీవాడు
నీలోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు
నీతోడై గెలిపిస్తాడు
ఆంజనేయుడు నీవాడు
నీతోనే ఉన్నాడు
నీవాడై బలమిస్తాడు
నీతోడై గెలిపిస్తాడు
________________
Song Credits:
పాట పేరు: ఆంజనేయుడు నీవాడు (Anjaneyudu Neevadu)
సినిమా పేరు: సుప్రీమ్ (Supreme)
సంగీత దర్శకుడు: సాయి కార్తీక్ (Sai Kartheek)
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి (Ramajogaiah Sastry)
గాయకులు: కార్తీక్ (Karthik), సూరజ్ సంతోష్ (Sooraj Santosh), దీప్తి పార్థసారథి (Deepthi Parthasarathy)
నిర్మాత: దిల్ రాజు (Dil Raju)
దర్శకుడు: అనిల్ రావిపూడి (Anil Ravipudi)
నటుడు : సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej)
నటి: రాశి ఖన్నా (Rashi Khanna)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.