అందరాని దూరములో అందమైన కొండలలో
అందరాని దూరములో అందమైన కొండలలో
హాయిగా నువ్ కుర్చున్నావా ఓ శబరివాసా
మాయ బతుకు మాకిచ్చావా ఓ పంచగిరీశ
స్వర్గాన్నే చూపిస్తుందో నరకాన బలిచేస్తుందో
కష్ట సుఖము ఏమో తెలియని ఈ మానవ పయణం
ఏ క్షణాన ఎలాగ మారునో ఈ జీవిత గమనం
కష్ట సుఖము ఏమో తెలియని ఈ మానవ పయణం
ఏ క్షణాన ఎలాగ మారునో ఈ జీవిత గమనం
అందరాని దూరములో అందమైన కొండలలో
అందరాని దూరములో అందమైన కొండలలో
ఎంతసాగినా అంతులేని ఈ జీవిత సంద్రంలో
తీరమన్నదే కానరాదు ఈ కాపురాల సుడిలో
భలే మాయాజాలంతో నువ్ సృష్టించేవు లోకం
ఆశలెన్నో కలిపించేసి మిగిలించేవు శోకం
నీ మాయ తెలియని ప్రాణం చేసెను ఊహల యానం
అందమైన రూపం మాకు అందించేవయ్యా
అంతలోన బూడిద మాకు పెగిలించావయ్యా
అందమైన రూపం మాకు అందించేవయ్యా
అంతలోన బూడిద మాకు పెగిలించావయ్యా
అందరాని దూరములో అందమైన కొండలలో
అందరాని దూరములో అందమైన కొండలలో
కలియుగమ్మునా శిలలోనా నీవు ఆవహించివున్నావు
కలల పేరుతో మనసులోన అడియాశ రేపినావు
ఆలుబిడ్డలు అందరు కలిసి అనురాగము అన్నావు
లేని పోనీ ఆశలు చూపి అనుబంధము అన్నావు
కలబోసి కలిసేలోగా బంధాలు పెరిగేలోగా
ఒక్కరికొక్కరు విడదీస్తావా ఓ శబరివాసా
ఒంటరిగా రమ్మంటావో ఓ పంచగిరీశ
ఒక్కరికొక్కరు విడదీస్తావా ఓ శబరివాసా
ఒంటరిగా రమ్మంటావో ఓ శబరివాసా
అందరాని దూరములో అందమైన కొండలలో
అందరాని దూరములో అందమైన కొండలలో
కలిమిలేములో కష్ట సుఖములో ఒక్కటే అన్నావు
కాసులపై మాకు ఆశ చూపి నీవు మోసగించినావు
ఆశలన్నీ జివ్వులలోన ఒక్కటే అన్నావు
మనిషికేమో దురాశనిచ్చి దుర్మార్గుడవన్నావు
నీ మాయ తెలిసిన మనిషి పాపమెంతో చేసెను తెలిసి
వందేళ్ల జీవితమంటూ మురిపించేవయ్యా
ఒక్క క్షణములోనే అంత మరిపిస్తావయ్య
వందేళ్ల జీవితమంటూ మురిపించేవయ్యా
ఒక్క క్షణములోనే అంత మరిపిస్తావయ్య
అందరాని దూరములో అందమైన కొండలలో
అందరాని దూరములో అందమైన కొండలలో
హాయిగా నువ్ కుర్చున్నావా ఓ శబరివాసా
మాయ బతుకు మాకిచ్చావా ఓ పంచగిరీశ
స్వర్గాన్నే చూపిస్తుందో నరకాన బలిచేస్తుందో
కష్ట సుఖము ఏమో తెలియని ఈ మానవ పయణం
ఏ క్షణాన ఎలాగ మారునో ఈ జీవిత గమనం
కష్ట సుఖము ఏమో తెలియని ఈ మానవ పయణం
ఏ క్షణాన ఎలాగ మారునో ఈ జీవిత గమనం
అందరాని దూరములో అందమైన కొండలలో
అందరాని దూరములో అందమైన కొండలలో
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.
