అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం
అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం
అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా
ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా
ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా
ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా
ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే
ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే
అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం
వాగు వంక పొంగే వానాకాలంలోన
వింటావమ్మా నది పాట ఓ నది పాట
మల్లే మొగ్గ బంతి బుగ్గ మీటి పాటే
కట్టిదంమ్మా వని పాట ఓ వని పాట
ఏయ్… చిందులు వేయించే పాట
కనువిందులు కావించే పాట
గుండె సంధించే పాట
ఆ దివిని అందించే పాట
నా పాట సవ్వడి వింటూ తిరిగే భూమి ఎల్లప్పుడూ…
అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం
చిన్ని చిన్ని ఊయల కట్టి
అమ్మ జోల లాలి లాలి తొలిరాగం ఓ తొలిరాగం
ఆలుమగలు గుట్టుగ చేరి
ఏకాంతంలో పాడే రాగం అనురాగం ఓ అనురాగం
హే… లోకమంటే వింత అది తెలియకుంటే చింత
నువ్వు నేను అంతా ఆ దేవుని ముందు ఎంత
అరె అన్నీ తెలిసినవాడు ఎవడూ లేనేలేడమ్మా
అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం
అందాల ఆకాశమంతా ఆడిందే బొమ్మా
ఆ దేవుణ్ణి జోకొట్టే రాగం వినుకోవే బొమ్మా
ఆ పాట కనరాని చోటు ఏడుందే బొమ్మా
ఈ పాట ఇచ్చింది కూడ ఈశుడే బొమ్మా
ముక్కంటి పాదాలు నేను ముద్దుపెట్టానే
ముద్దుగా ప్రజల గుండెల్లో నన్ను పెట్టాడే
అత్తిందోం తింధియం తొందానా తిందాది నుందోం
తకదింతోం తింధియం తొందానా దిందాది నుందోం
_________________________
పాట పేరు: అందాల ఆకాశమంత (Andala Akasamanta)
సినిమా పేరు: చంద్రముఖి (Chandramukhi)
దర్శకుడు: పి.వాసు (P.Vasu)
సంగీత దర్శకుడు: విద్యా సాగర్ (Vidhya Sagar)
నటీనటులు : రజనీకాంత్ (Rajinikanth), నయనతార (Nayantara)
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ (Suddhala Ashok Teja)
గాయకులు: S.P. బాలసుబ్రహ్మణ్యం (S.P. Balasubramanyam)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.