Home » చిరంజీవి సూపర్ హిట్ అందాలలో లిరికల్ సాంగ్ – జగదేకవీరుడు అతిలోకసుందరి

చిరంజీవి సూపర్ హిట్ అందాలలో లిరికల్ సాంగ్ – జగదేకవీరుడు అతిలోకసుందరి

by Vinod G
0 comments
andaalalo song lyrics Jagadeka Veerudu Athiloka Sundari

ల ల ల లా లల ల లా
ల ల ల లా లల లల లలా
ల ల ల లా లల ల లా
హు హు హు హూ హు హు

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారాల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

లతా లతా సరాగమాడే సుహాసిని సుమాలతో
వయస్సుతో వసంతమాడి వరించెలే సరాలతో
మిలా మిలా హిమాలే జలా జలా ముత్యాలుగా
తళా తళా గళాన తటిల్లదా హారాలుగా
చేతులు తాకిన కొండలకే చలనము వచ్చెనులే
ముందుకు సాగిన ముచ్చటలో మువ్వలు పలికెనులే
ఒక స్వర్గం తలవంచీ ఇల చేరే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
పువ్వు నవ్వు పులకించే గాలిలో నింగీ నేలా చుంబించే లాలిలో
తారాల్లారా రారే విహారమే
అందాలలో అహో మహోదయం నా చూపుకే శుభోదయం

సరస్సులో శరత్తు కోసం తపస్సులే ఫలించగా
సువర్ణిక సుగంధమేదో మనస్సునే హరించగా
మరాళినై ఇలాగే మరీ మరీ నటించనా
విహారినై ఇవాళే దివి భువి స్పృషించనా
గ్రహములు పాడిన పల్లవికే జాబిలి ఊగెనులే
కొమ్మలు తాకిన ఆమనికే కోయిల పుట్టెనులే
ఒక సౌఖ్యం తనువంతా చెలరేగే క్షణాలలో

అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం
నీలాకాశం దిగివచ్చే లోయలో ఊహాలోకం ఎదురొచ్చే హాయిలో
నాలో సాగే ఏదో సరాగమే
అందాలలో అహో మహోదయం భూలోకమే నవోదయం


పాట పేరు: అందాలలో (Andaalalo)
సినిమా పేరు: జగదేకవీరుడు అతిలోకసుందరి (Jagadeka Veerudu Athiloka Sundari)
గానం: ఎస్.పి. బాలసుబ్రమణ్యం (S.P. Balasubramanyam), ఎస్ జానకి (S Janaki)
సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి (Veturi Sundara rama murthy)
సంగీతం: ఇళయరాజా (Illayaraja)
దర్శకుడు: కె రాఘవేంద్ర రావు (K Raghavendra rao)
తారాగణం: చిరంజీవి (Chiranjeevi), శ్రీదేవి (Sridevi) అమ్రిష్ పురి (Amrish Puri), అల్లు రామలింగయ్య (Allu Ramalingaiah), బ్రహ్మానందం (Brahmanandam) తదితరులు

👉 ఇంకా ఇలాంటి లేటెస్ట్ పాటలు కావాలంటే తెలుగురీడర్స్ ని ఫాలో అవ్వండి ! అలాగే మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే కామెంట్లో పేరు చెప్పండి – మేము దాన్ని త్వరగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం!

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.