కనువిందైన కళలల్లింది అందంగా మది
నిలవని పరుగులోనా పడిలేస్తుంది నీ వెంటే అది
వినదుగా నిన్ను చూడగానే దానికెందుకింత మారం
పరదాలు లేని గాలి లాగా దూకుతుంది పాదం..
ఇటు చూడు చూడు చూడు చూడు నా వైపోసారి
నీలోన చేరి మారిపోయ వేరేదో దారి…
ఆనందం ఆనందం ఆనందమాయే
మెల్లగా అల్లిన సంబరమాయే
ఆనందం ఆనందం ఆనందమాయే
మెల్లగా అల్లిన సంబరమాయే
మాటలకందని మౌనమాయే
ఎహే మాయదారి లక్కు నన్ను గుర్తుపట్టదాయే
చూసి చూడనట్టు చూడగానే పారిపోయే..
అర్ధమైతే ఒట్టు ఫేటు రూటు మరదాయే
ఇంత టార్చెర్ ఏంది రా ??
కళ్ళ ముందరున్న తిండి నోటికందదాయే
అప్పులన్నీ చూస్తే లెక్కలేమో చుక్కలాయే
పక్కనేమో చందమామలాంటి అందమున్న
పట్టనట్టు గుండెకేవయిందో చెప్పదేరా ??
ఏ దయ రదేరా ఈ వేద తీరేదా
హ కథ మారేనా ఇదే గొడవ
గోవిందా గోవిందా ఏమైనా దారుందా
నా మోర వినవా ఊ అనవా
అరె అరె ఇటు చూడు చూడు చూడు చూడు
ఏంటి ఈ విడ్డురం…
కలనైనా రాకమారదేంటో అయ్యో అన్యాయం
ఆనందం ఆనందం ఆనందమాయే
ఆనందమన్నది అందరిదాయే
ఆనందం ఆనందం ఆనందమాయే
మాటలు తోచని మౌనమాయే
_________________________
సాంగ్ – ఆనందమాయే (Aanandhamaaye)
చిత్రం: బ్రహ్మా ఆనందం (Brahma Anandam)
సంగీతం: శాండిల్య పిసపాటి (Sandilya Pisapati)
లిరిక్స్ : శ్రీ సాయి కిరణ్ (Sri Sai Kiran)
గాయకులు: యశ్వంత్ నాగ్ (Yashwanth Nag) & మనీషా ఈరబతిని (Manisha Eerabathini)
నటీనటులు : రాజా గౌతమ్ (Raja Goutham), ప్రియా వడ్లమాని (Priya Vadlamani)
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్కా (Rahul Yadav Nakka)
దర్శకుడు: Rvs నిఖిల్ (Rvs Nikhil)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.