అంబారాల వీధిలో చిన్ని చందమామ రా
అందునా ఒదిగుంది రా
చెవుల పిల్లిరా
నీడ నీలి దీవిలో
నీటి మీద మెరిసెరా
ఆ వెన్నెల కాంతిలో కుర్మముందిరా
ఆ మయ తాబేలుకి తాంబూలా
పెటిక కట్టుందిరా
తాపీగా ఈదుకుంటూ నీళ్లలో
ఏమూలో దాక్కుంది రా
తార లాంటి ఆకారం తాళమే
దానికి వేసుందిరా
లెక్కనే పెట్టలేని ఒక్కలే
అందులో ఉన్నయిరా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు హ్మ్మ్…
లాలీ జో లాలీ జో హ్మ్…
లాలీ జో లాలీ జో
నీ సుధూర దారిలో ఆగకుండా సాగిపో
చెయ్యి పట్టి చూపగా తోడులేరని ఆ ఆ..
ఎదురు నీకు లేదులే
అడ్డు నీకు రాదులే
దారినిచ్చి జరుగులే నీటి అలలివే
నిశ్చింత గానే ఉండు
గాలులే నొప్పిని తీర్చ రావా
ఆకాశ నక్షత్రాలే
దిక్కుల్నే చూపెట్టవచ్చులేరా
నీ ముందు అగి పుట్టె
చీకట్లే పారదోల కదిలే
నువ్వోక్క విత్తు వేస్తే
ఈ మన్ను ఆడవాళ్లే మార్చేయదా
బుజ్జాయి రారా
కథ చెబుతా కన్నా
వినుకోరా నువ్వే బజ్జో
లాలీ జో లాలీ జో నాన్న
సరదాగా ఆడు మురిపెంగా ఆడు
ఎదుగుగింక ఎదుగు ఎదుగు
నిలవర… నిలవర..
పరుగున లే కదలరా
నిలవర… నిలవర..
జగమునే నువ్ గెలవరా
__________________________________
పాట పేరు: అంబరాలా వీధిలో (Ambaraala Veedhilo)
చిత్రం: ఏ.ఆర్.యమ్ (A.R.M)
సంగీత స్వరకర్త: ధిబు నినన్ థామస్ (Dhibu Ninan Thomas)
సాహిత్యం: కృష్ణకాంత్ (Krishna Kanth)
గానం: సిందూరి విశాల్ (Sinduri Vishal)
తారాగణం: టోవినో థామస్ (Tovino Thomas), కృతి శెట్టి (Krithi Shetty), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), సురభి లక్ష్మి (Surabhi Lakshmi), బాసిల్ జోసెఫ్ (Basil Joseph)
దర్శకుడు: జితిన్ లాల్ (Jithin Laal)
రచించినవారు: సుజిత్ నంబియార్ (Sujith Nambiar)
నిర్మించినవారు: లిస్టిన్ స్టీఫెన్ (Listin Stephen), డాక్టర్ జకరియా థామస్ (Dr. Zachariah Thomas)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.