Home » అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం- మెం ఫేమస్

అల్లుకున్న తీగతో కలుసుకున్న ఆకులం- మెం ఫేమస్

by Vinod G
0 comment
344

అల్లుకున్న తీగతో..
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా….
బెదిరిపోని మిత్రులం

చిన్ననాటి నుండి
జ్ఞానపకాల తోని
కట్టుకున్న వంతెనేమైంది
ఇంతలోనే వాన తాకినట్టు
ఈ కాలం కూల్చేనా….

మనకు మనకు మధ్య
దాచుకున్న మాటలంటు
లేనే లేవు ఇంతవరకు
ఇప్పుడెందుకో దాచిపెట్టె
ఈ బాధే లోతునా …..

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

స్నేహమంటే నవ్వుల్లోనే ఉంటదా
బాధలోను ఉంటేనే దోస్తులురా
మాది కాదు బాధనుకుంటే
స్నేహం ఉండదురా…..

తప్పుల్లోనూ నీతోనే ఉన్నామురా
గొప్పల్లోను నీతోనే ఉన్నామురా
చెప్పలేని బాధే ఉన్నా
చెయ్యే వదలమురా…

నీతో ఉంటూ మాటలు రాని
మోనం చూడకురా
మోనం వెనకే మాటలు కలిసిన
భాదుందిరా లోపల

స్నేహంలోన కోపాలన్నీ
కరిగే మేఘాలురా
స్నేహం అంటే ఎప్పుడు ఉండే
ఆకాశమే కదరా….

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

కళ్ళలోకి కన్నీరు రాగానే
మాట కొంచం తడబడుతుండగానే
ఏమైంది మామ అంటూ
అడిగె గొంతువిరా …

నీతో ఉంటే నవ్వుతు ఉంటరా
నవ్వుంటేనే మనమని అంటమురా
కారణాలు దొరకవు
నువ్వు దూరం పోవాలన్నా …..

నీకు నాకు మధ్యలో
దూరం రావాలన్న
వద్దు అంటూ ఆ క్షణాన్ని
ఏడుస్తూ ఆపనా….

గమ్యం చేరే పయనాన్ని
స్నేహం ఆపుతుందా
నీ మంచే కోరి పొమ్మనేంత
ప్రేమా మాకు లేదు

అల్లుకున్న తీగతో
కలుసుకున్న ఆకులం
స్నేహమన్న మాటలో
ముచ్చటైన ముగ్గురం

అందమైన జీవితం
పంచుకున్న దోస్తులం
బాధలెన్ని చేరినా
బెదిరిపోని మిత్రులం

మరిన్ని పాటల సాహిత్యం కొరకు తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Exit mobile version