Home » ముందుగానే రుచి చూసి బాగుందో లేదో చెప్పేస్తానంటున్న AI నాలుక (AI Tongue)

ముందుగానే రుచి చూసి బాగుందో లేదో చెప్పేస్తానంటున్న AI నాలుక (AI Tongue)

by Vinod G
0 comment

హాయ్ తెలుగు రీడర్స్ ! కృత్రిమ నాలుక ఏంటి ? ఆహారం మనం తినకుండా ముందుగానే దాని టేస్ట్ ఎలా చెప్తుంది అని అనుకుంటున్నారా ! అవునండీ అమెరికాకు చెందిన ప్రముఖ యూనివర్సిటీ స్టూడెంట్స్ AI టెక్నాలజీ సహాయంతో ఒక నాలుకని తయారు చేశారు. ఈ AI నాలుక ((AI Tongue) ఆటోమేటిక్ గా రుచి చూస్తుందని వీరు చెప్తున్నారు. ఈ నాలుక మీద ఏదైనా లిక్విడ్ ఐటెం గాని లేదా సాలిడ్ ఐటెం గాని ఇంకా ఏదైనా ఫుడ్ ఐటెం గాని పెడితే, ఇది దాని సెన్సార్ సహాయంతో దాని టేస్ట్ చూసి ఎలా ఉందో మనకి చెప్పేస్తుందంట.

ప్రస్తుతం వీళ్ళు చెప్పేదాని ప్రకారం పెప్సీకి, కోకోకోలాకి డిఫరెన్స్ చెప్పేసిందంట. అంతే కాకుండా ఇంకా మనం తినే ఆహారం అనేది ముందు గానే రుచి చూసి అది తినదగిందా లేదా పాడైపోయిందా అనే విషయాన్నీ కూడా ఈ AI నాలుకను (AI Tongue) ఉపయోగించి తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఇలాంటి సౌకర్యం అనేది ఒకటుంటే మనం ఏదైనా హోటల్స్ లేదా రెస్టారెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ వడ్డించే ఆహారం మంచిదో కాదో సులభంగా తెలుసుకోవచ్చు కదా !

ai tongue for food taste

ప్రస్తుత కాలంలో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ లో కూడా పాడైపోయిన ఆహార పదార్ధాలను వాడుతున్నారని నిత్యం మనం వార్తలు వింటూనే ఉన్నాం. ఇటువంటప్పుడు ఇలాంటి AI నాలుక (AI Tongue) వంటి టెక్నాలజీ జనానికి ఎంతగానో మేలుచేయనుంది దీంతో ఇది మంచి జనాదరణ పొందే అవకాశముంది. అయితే ప్రస్తుతం ఈ నాలుక పరిశీలన దశలో ఉందంట, త్వరలోనే దీన్ని మార్కెట్ లో విడుదల చేస్తామంటున్నారు నిపుణులు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ టెక్నాలజీ చూడండి

You may also like

Leave a Comment