ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లాలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉన్న అహోబిల క్షేత్రం ప్రకృతి సౌందర్యానికి నెలవు. ఈ క్షేత్రం కొండలు, నదులు, ప్రకృతి సహజ వనరులతో అలరారుతూ భక్తుల మనసులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ నరసింహుడు హిరణ్యకశిపుడిని సంహరించిన అనంతరం, ఆ భయంకర రూపాన్ని చూసి దేవతలు “అహో! ఎంత బలవంతుడు” అని కీర్తించారు. అందువల్ల ఈ స్వామివారికి “అహో భళా” అనే పేరు వచ్చింది, తదనంతరం ఇది అహోబిలంగా ప్రసిద్ధి పొందింది.
సనాతన శ్రీ వైష్ణవ పీఠాలలో అహోబిలానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది పరమ పావనమైన నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి తొమ్మిది రూపాలలో భక్తులకు దర్శనమిచ్చే నవ నరసింహ క్షేత్రంగా విఖ్యాతి పొందింది. భారతదేశంలోని 108 వైష్ణవ క్షేత్రాల్లో – అహోబిలం కూడా ఒకటి.
నవ నరసింహ ఆలయాలు అహోబిలం :
తొమ్మిది నరసింహ అవతారాల ఆలయాలు శ్రీ జ్వాలా నరసింహ, శ్రీ అహోబిల నరసింహ, శ్రీ మాలోల నరసింహ, శ్రీ క్రోడ నరసింహ, శ్రీ కరంజ నరసింహ, శ్రీ భార్గవ నరసింహ, శ్రీ యోగానంద నరసింహ, శ్రీ చత్రవట నరసింహ మరియు శ్రీ పావన నరసింహ.
జ్వాలాహోబిల మాలోల క్రోడ కరంజ భార్గవ
యోగానంద చత్రవట పావన నవ మూర్తయే
ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం :
అహోబిలం లో ఎగువ అహోబిలం మరియు దిగువ అహోబిలం అని రెండు ఉంటాయి. అహోబిలం టూర్ ప్లాన్ చేసేవారు 2 రోజులు ప్లాన్ చేసుకోవడం మంచిది. దిగువ అహోబిలం ఒకరోజు పడుతుంది. ఎగువ అహోబిలం ఒకరోజు పడుతుంది.
ఎగువ అహోబిలం:
శ్రీ అహోబిల నరసింహ ఆలయం :
ముందుగా ఎగువ శ్రీ అహోబిల నరసింహ ఆలయం దర్శించుకుందాం. దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం చేరేందుకు జీప్ లు, ఆటో లు మరియు బస్సు లు అందుబాటు లో ఉంటాయి. అహోబిలం లోని నవ నరసింహ క్షేత్రములలో మొదటిది ఈ అహోబిల నరసింహ ఆలయం. ఇది రెండు కొండల మధ్యన మనకు దర్శనమిస్తుంది. ఫ్రీ దర్శనం కోసం గుడి పక్క వైపున వెళ్ళాలి. నరసింహ స్వామి వారు మొదటిగా ఉగ్రరూపం లో ఇక్కడే కనిపించారంట. ఈయన్ని స్వయంభు అహోబిల నరసింహ స్వామి అని పిలుస్తారు.
క్రోడ (వరాహ) నరసింహ ఆలయం :
ఇప్పుడు దర్శించుకునే ఆలయం క్రోడ నరసింహ ఆలయం. దీనినే వరాహ నరసింహ ఆలయం అని కూడా అంటారు. ఇది ఎగువ అహోబిల నరసింహ ఆలయం పక్కాగా వెళ్లే మెట్ల మార్గం నుంచి 2 కిలో మీటర్ ల దూరం లో ఉంది. ఈ ఆలయానికి వచ్చే మార్గం లో సేద తీరడానికి నిర్మించిన మండపాలు కూడా చాలా ఉంటాయి. చుట్టూ నీరు మరియు చెట్లతో దారంతా నిండివుంటుంది.
నరసింహ స్వామి హిరణ్యకశిపుడ్ని చంపినప్పుడు, హిరణ్యకశిపుడి తమ్ముడైన హిరణ్యసుడు కోపం తో భూదేవి ని పాతాళ లోకానికి తోక్కేసాడు. అప్పుడు నరసింహ స్వామి వారాహి అవతారం ఎత్తి పాతాళ లోకం నుంచి భూమాత ను పైకి తీసుకుని వచ్చి ఇక్కడే స్వయంభు అవుతాడు.
మలోల నరసింహ ఆలయం:
వరాహ నరసింహ ఆలయం నుంచే ఈ ఆలయానికి దారి ఉంటుంది. మలోల నరసింహ ఆలయం చాలా ఎత్తులో మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం ఉన్న ప్రదేశం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయం ప్రాముఖ్యత ఏమిటంటే నరసింహ స్వామి వారు చెంచు లక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నాక. అమ్మవారు అలిగి ఈ ఆలయానికి వచ్చేస్తుంది. తరువాత స్వామి వారు ఇక్కడికి వచ్చి తమ తొడల కూర్చోబెట్టుకుని అమ్మవారిని బుజ్జగించారంట. ‘మలోల’ అనే పదానికి లక్ష్మి (మా=లక్ష్మి, లోల=ప్రియమైనది) అని అర్థం.
ప్రహ్లాద బడి :
ఈ ఆలయానికి సగం దూరంలో ప్రహ్లాద మెట్టు (ప్రహ్లాదుడు చదివిన పాఠశాల) ప్రహ్లాద బడి అనే ప్రదేశం ఉంది. హిరణకశిపుడు, ప్రహ్లదుడ్ని పై నుంచి కింద పడేయమంటారు. ప్రహ్లదుడు కింద పడినప్పుడు శ్రీ మహా విష్ణువు రక్షిస్తాడు, ఆ ప్రదేశమే ఇదే. ఇక్కడ మెట్ల కింద నేలపై ప్రహ్లాదుడు రాసుకున్న గీతలే కనిపిస్తుంటాయి.
శ్రీ జ్వాల నరసింహ ఆలయం :
క్రోధ నరసింహ ఆలయాన్ని దర్శించాక పావనాశిని నది ఒడ్డున్న నడుచుకుంటూ వెళితే జ్వాల నరసింహ ఆలయాన్ని చేయుకుంటారు. జ్వాల నరసింహ ఆలయం చూసేందుకు కొండ గుహలో కట్టిన ఆలయం లా కనిపిస్తుంది. ఇక్కడ స్వామి జ్వాల నరసింహుడిగా దార్శనిస్సామిస్తాడు. ఈ ఆలయమున్న ప్రదేశమే నరసింహస్వామి, హిరణ్యకశిపుడ్ని తన చేతి గోర్లతో చీల్చి సంహరించిన ప్రదేశం. దీనినే సభా మందిరం అని అంటారు. అహోబిలం వచ్చిన వారు ముఖ్యంగా దర్శించుకోవాల్సిన ప్రదేశం.
ఈ ఆలయానికి వెళ్లే మార్గంలో కొండల మీద నుంచి కిందకు పడే నీటి ధర లు జలపాతాలు (వాటర్ ఫాల్స్) ను తలపిస్తుంది. చాలా చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది.
రక్త కుండ్ :
జ్వాల నరసింహ స్వామి ఆలయం ఎదురుగా రక్త కుండం ఉంటుంది. అహోబిలం లోని అత్యంత పవిత్ర తీర్థం ఇది. నరసింహ స్వామి హిరణ్యకశిపుడ్ని చంపిన తర్వాత తన చేతులని ఈ కుండం లోనే శుభ్రపరుచుకున్నాడంటా. అందువలన నీరు ఎరుపు రంగులోకి మారింది. ఇప్పుడు చూస్తే ఆ నీరు చాలా నిర్మలంగా కనిపిస్తాయి. అక్కడకి వెళ్లిన ప్రతి ఒక్కరికి త్రాగడానికి ఆ కుండం నుంచి నీరు తీసి ఇస్తారు.
ఉగ్ర స్తంభం :
తరువాత వెళాల్సిన ప్రదేశం ఉగ్ర స్తంభం. జ్వాలా నరసింహ ఆలయం దెగర నుంచి ఉగ్ర స్తంభం కు వెళ్లే దారి కనిపిస్తుంది. ఇక్కడికి అందరూ చేరుకోలేరు. అహోబిలంలో అత్యంత కష్టదాయకమైన ప్రయాణం ఉగ్ర స్తంభం చేరుకోవడం. ఇది 2800 అడుగుల ఎత్తులో ఉంది. ఎవరైతే మంచి శరీర శక్తిని కలిగి ఉంటారో, వారు మాత్రమే ఈ ప్రణయం చేయగలరు.
ఇంతకీ అక్కడ ఏముందో తెలుసా! లక్ష్మి నరసింహ స్వామి వారు స్థంబాన్ని చీల్చుకుని బయటికి వస్తారు కదా!. అది ఈ కొండ పైన చూడవచ్చు. ఇక్కడికి వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి, నీరు తప్పనిసరి. ఎక్కేందుకు 3 గంటల వరకు పడుతుంది.
శ్రీ పావన నరసింహ ఆలయం :
ఈ ఆలయానికి రెండు మార్గాలున్నాయి. ఒక మార్గం ఎగువ అహోబిలం గుడి పక్కన మెట్ల మార్గం. మరొకటి గుడి బయట ఎంట్రన్స్ లో ఒక మార్గం ఉంది. ఎగువ అహోబిలం నుంచి 7 కి.మీ దూరంలో ఉంది శ్రీ పావన నరసింహ ఆలయం. ఈ ఆలయాన్ని పాములేటి నరసింహ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయం పావన నది ఓడ్డున ఉంది.
ఈ ఆలయం దట్టమైన అడవుల్లో ఉంటుంది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి జీప్ లా సాయం పొందవచ్చు. నరసింహ స్వామి ఈ ప్రదేశానికి వచ్చాక శాంతి పడ్డాడని చెప్తారు. ఈ ఆలయానికి శనివారం మాత్రమే వెళ్ళడానికి అనుమతని ఇస్తారు.
గమనిక: ఎగువ అహోబిలం లో ఉచిత అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఇక్కడ భోజనం పూర్తి చేసే అవకాశం ఉంటుంది. పెద్ద వారు నడవలేరు కాబ్బటి వారిని ప్రత్యక రీతిలో మోసుకుని వెళ్ళడానికి డోలీలు కూడా ఉంటాయి.
దిగువ అహోబిలం :
ప్రహ్లాద వరద నరసింహ ఆలయం :
దిగువ అహోబిలం లో ముందుగా ప్రహ్లాద వరద నరసింహ స్వామి ఆలయానికి చేయుకుంటాం. దీనిని విజయనగర రాజులు నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. గుడి ద్వారం 30 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రదేశంలో మీకు నచ్చినంత సమయం గడపొచ్చు.
చత్రవట నరసింహ ఆలయం:
చత్రవట నరసింహ ఆలయం చాలా అందగా కనిపిస్తుంది. దిగువ అహోబిలం నుంచి 2 కి.మీ దూరంలో ఉంది. ఇక్కడికి నడిచైన వెళ్లొచ్చు లేదంటే జీప్ మాట్లాడుకుంటే జీప్ వాళ్ళు చత్రవట నరసింహ స్వామి ఆలయానికి తీసుకుని వెళ్తారు. స్వామి ముళ్ల పొదల చెట్ల లో స్వామి వెలిశాడంట. అందుకే చత్రవట నరసింహ అనే పేరు వచ్చింది. ఇక్కడ స్వామి ఎడమ చెయ్యి తాళం వేసే రూపం లో ఉంటుంది.
యోగానంద నరసింహ ఆలయం :
చత్రవట నరసింహ ఆలయం దర్శించుకున్నాక 1 కి.మీ దూరంలో యోగానంద నరసింహ ఆలయం ఉంది. ఇది కూడా అహోబిలం నవ నరసింహ క్షేత్రములలో ఒకటి. ఈ ప్రదేశంలో ప్రహ్లదుడికి, నరసింహస్వామి యోగ ముద్రలు నేర్పేరంట. నరసింహ స్వామి ఇక్కడ యోగ ముద్రలో దర్శనమిస్తాడు.
కరంజా నరసింహ ఆలయం :
ఈ ఆలయం ఎగువ అహోబిలం నుంచి దిగువ అహోబిలం వెళ్లే మార్గం మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్వామి వారు కరంజి చెట్టు కింద ఉండటం వలన కరంజా నరసింహ స్వామి అనే పేరు వచ్చింది. నరసింహ స్వామి వారు, ప్రహ్లాదుడు మరియు చెంచు లక్ష్మి అమ్మవారు ఇక్కడే నివసించేవారంటా. అయితే చెంచు లక్ష్మి అమ్మవారు స్వామి వారు మీద ఆలిగి మలోల వెళ్లిపోయిందని చెపుతుంటారు.
భార్గవ నరసింహ ఆలయం :
తదుపరి భార్గవ నరసింహ ఆలయానికి వెళ్ళాలి. ఈ ఆలయం దట్టమైన అడవుల్లో ఉంటుంది. దాదాపు 1 కి.మీ వరకు అడవిలో వెళ్లాల్సి ఉంటుంది. పరుశురాముడు ఈ ప్రదేశం లో స్వామి కోసం గోరా తప్పస్సు చేసేడంటా. పరుశరాముడు మరో పేరు భార్గవ రాముడు అందుకే భార్గవ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం దెగర్లో అక్షయ తీర్ధం (భార్గవ తీర్థం) ఉంటుంది, తప్పక దర్శించండి.
అహోబిలం కు దారి :
ఇక్కడికి వచ్చేవారు హైదరాబాద్ నుంచి గాని, తిరుపతి నుంచి గాని చాగల్ మర్రి నుంచి వచ్చేయొచ్చు. అలాగే బాచ్ పల్లి రోడ్ మీదగా కూడా వచ్చేయొచ్చు. చెన్నై, ముంబై నుంచి వచ్చేవాళ్లయితే దెగర్లో కర్నూల్ కాబట్టి అక్కడ నుంచి రోడ్డు మార్గంలో ఆళ్లగడ్డ కు చేరుకొవాలి. ఆళ్లగడ్డ నుంచి బస్సు ద్వారా ఇక్కడికి రావొచ్చు.
ఉత్సవాలు :
అహోబిలంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ (మార్చి-ఏప్రిల్) మాసంలో బ్రహ్మోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. అలాగే ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున గ్రామోత్సవం జరుగుతుంది, ఇందులో ప్రత్యేకంగా 108 కలశాలతో అభిషేకం చేస్తారు. ఈ ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తాయి.
వసతి సదుపాయం:
అహోబిలం, ఆళ్లగడ్డ ప్రాంతంలో భక్తుల కోసం వసతి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణా మరియు ఆంధ్ర ప్రదేశ్ దేవస్థాన బోర్డు ఆధ్వర్యంలో వసతి గృహాలు లభిస్తాయి.
సందర్శించడానికి ఉత్తమ సమయం :
అహోబిలం సందర్శించడానికి ఉత్తమ కాలం అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి, ప్రకృతి సౌందర్యం ముద్దాడే విధంగా ఉంటుంది.
మరిన్ని ఇటువంటి ఆలయాల కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చూడండి.