ఎట్టుండాలే వాడు నన్ను లవ్వాడే పిల్లగాడు
ఎట్టుండాలే వాడు నన్ను పెళ్లాడే పోరగాడు
పల్లెటూరి పొగరులా పట్టణం దోర బాబులా
అందమైన నవ్వుతో అదిరిపోయే స్టైలుతో
మొండిగుండాలే ముద్దుగుండాలే
వాడ్ని చూసే కొద్దీ పిచ్చెక్కి పోవాలే
అరెరే అచ్చ తెలుగు మగాడిలా మస్తుగుండాలే
గుండెనిండా పౌరుషంతో ఊరకలెయ్యలే
పోట్లగిత్తనే నెగ్గేవాడు నాకై రావాలే
పిల్ల కోసం కొండలనైన పిండిని చెయ్యాలే
నడిచొస్తూ ఉంటుంటే పులి లాగానే ఉండాలే
నవ్వుకుంటూ వస్తుంటే గుండె చిందులు వెయ్యాలే
తన పక్కనే నేనుంటే సరి జోడిగా ఉండాలే
పది మందిలో తానుంటే రారాజల్లే ఉండాలే
లవ్ యూ చెప్పాలి రోజుకు నూటొక్క సార్లైనా
చూట్టు తిరగాలి బుజ్జి బంగారమంటూనే
కన్నె కొట్టలే కితకితలెట్టాలే
నేను నవ్వి నవ్వి సచ్చిపోవాలే
అరెరే అచ్చ తెలుగు మగాడిలా మస్తుగుండాలే
గుండెనిండా పౌరుషంతో ఊరకలెయ్యలే
పోట్లగిత్తనే నెగ్గేవాడు నాకై రావాలే
పిల్ల కోసం కొండలనైన పిండిని చెయ్యాలే
తాళి కట్టేసాడంటే తన కోసమే బతికేస్తా
ఏలు పట్టేసాడంటే ఏటిలోకైనా దూకేస్తా
ఆడు అన్నం తింటుంటే కన్న తల్లిగా ఉంటాలే
ఆడు పక్కలోకొస్తుంటే రంభ లెక్కన ఉంటాలే
కవ్విస్తుంటాను చూపుల్తో మతేక్కిస్తాను
విందే చేస్తాను నడుముకు నాట్యము నేర్పాను
ముద్దుగా వస్తాలే ముడుపులు తీస్తాలే
ఆడు ఇచ్ఛయమంటే ప్రాణం ఇస్తానే
అబ్బా అచ్చ తెలుగు మగాడిలా మస్తుగుండాలే
గుండెనిండా పౌరుషంతో ఊరకలెయ్యలే
పోట్లగిత్తనే నెగ్గేవాడు నాకై రావాలే
పిల్ల కోసం కొండలనైన పిండిని చెయ్యాలే
_______________
నటీనటులు: చెర్రీ అన్షిక (Cherry Anshika) – రౌడీ హరీష్ (Rowdy Harish)
గాయకుడు: వాగ్దేవి (Vagdevi)
సంగీతం: నవీన్ జె (Naveen J)
లిరిక్స్ : హనుమయ్య బండారు (Hanumayya Bandaru)
కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : అర్జున్ విజయ్ దాసరి (Arjun Vijay Dasari)
నిర్మాత: దాసరి వెంకటయ్య (Dasari Venkataiah)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.