ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నన్నే దాచుకోనా
నువ్వే నేనని..
చందమామే నువ్వని
వెన్నెలేమో నేనని
నీతో జతై ఉండిపోనా
నేనే నువ్వనీ..
చిరుజల్లే కురిసినా
చిరు చెమటే మనసున
నువ్వో క్షణం దూరం అయితే
ఊపిరి ఆగేనా
హరివిల్లే మెరిసెనా
సిరిమల్లే విరిసెనా
నీతో ఉంటే ఇంతందంగా
లోకం చూస్తున్నా…..
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా…
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా…
సంద్రమల్లే ఎదురు చూస్తే
నదిలాగా మారనా
చైత్రమల్లే నువ్వు పూస్తే
చిగురాకే అవ్వనా
నన్నే వరించే యువరాజు నువ్వంటా
నీ యువరాణి పదవిస్తే చాలులెమ్మంటా
చెలి కులుకులొలుకు
పడుచు సొగసు నెమలి నువ్వైతే
నీ చెమకు చెమకు హొయలు
చిలుకు చినుకు నేనౌతా
మనసుకి నీ మీదే మనసైనదిలే
చెరిసగమై మరుజగమే మనమౌదాంలే
తియ్యనైన ఊసులాడు
తెలిమంచే నువ్వులే
వెచ్చనైన ఊహరేపు
తొలి వేకువ నేనులే
ఎన్నో వర్ణాల చిరుగాలి సవ్వల్లే
నువు పిలిచావని తలచావని
కబురు తెచ్చెలే
నువు దివిని వదిలి
భువికి దిగిన దేవకన్యవులే
నువు నడిచి వెలితే
పుడమి ఎదకు పులకరింతేలే
మిలమిల తారై
మది మురిసెలే
జిలిబిలిగా చలిగిలులే
చెలరేగెలే
ఆకాశమే నువ్వని
నీలి మేఘం నేనని
నీలో నన్నే దాచుకోనా
నువ్వే నేనని..
చందమామే నువ్వని
వెన్నెలేమో నేనని
నీతో జతై ఉండిపోనా
నేనే నువ్వనీ..
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా….
కళ్ళే నావి కలలు నీవి
పెదవే నాది పలుకు నీది
పాదం నాది పరుగు నీది
జన్మలెన్నున్నా….
__________________________
సాంగ్ : ఆకాశమే నువ్వని (Aakashame Nuvvani)
సినిమా: డైమండ్ రాజా (Diamond Raja)
సంగీత దర్శకుడు: అచ్చు రాజమణి (Achu Rajamani)
గాయకులు – సిద్ శ్రీరామ్ – చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada)
సాహిత్యం – రాంబాబు గోశాల (Rambabu Goshala)
తారాగణం: వరుణ్ సందేశ్ (Varun Sandesh), డాలీషా (Dollysha),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.