ఆడే పాడే వయసుకు నేడే (Aade Pade) సాంగ్ లిరిక్స్, సంక్రాంతి (Sankranthi)

by Lakshmi Guradasi

ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక
మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక
పుత్తడి వెలుగుల సూర్యుని రూపం
పున్నమి వెన్నెల చంద్రుని రూపం

మగువల నుదిటిన కుంకుమ రూపం
మనువుకు మంగళ సూత్రం రూపం
జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక

ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక

నా ఊహకు ఊపిరి నీవననా
నీ ఊహల ఊయల నేనననా
చిరకాలం నీకే చెలిమిని పంచే
పచ్చబొట్టు నేను అంటూ
నిన్ను అంటి ఉండనా

ఎన్ని సిరులున్న ఎన్ని మణులున్న
ఈ నాణెం ప్రాణం లే
నిన్ను నన్ను ఏకం చేసిన ఏకతాళం లే

ఎన్ని నిధులున్న ఎన్ని సుధలున్న
సుమగంధం నువ్వేలే
అందుకున్నా చందమామవు
నాకు నువ్వే లే

ఆడే పాడే వయసుకు నేడే అందిన కానుక
మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక

నా కలలకు రూపం నీవననా
నీ కవితకు ప్రాణం నేనననా
కాలకాలం తోడు నీడగా నిలిచే
కంటి పాప నేను అంటూ
చంటి పాపనవ్వనా

ఎన్ని కదలున్న ఎన్ని కలలున్న
మన ప్రేమోక కావ్యం లే
నీకు నేనే దాసుడినంటే
కాసి చాలవేలే

ఎన్ని నువ్వన్నా ఎన్ని నే విన్నా
ఆకాశం హద్దేలే
అమృతాలే కురిసే వేళ
పెదవి కందే లే

ఆడే పాడే వయసుకు నేడు అందిన కానుక
మాటే రాని మనసుకు ఏదో తెలియని వేడుక
పుత్తడి వెలుగుల సూర్యుని రూపం
పున్నమి వెన్నెల చంద్రుని రూపం
మగువల నుదిటిన కుంకుమ రూపం
మనువుకు మంగళ సూత్రం రూపం
జాతి పతాకపు అశోక చక్రం అంతటి కానుక

In English Version:

Aade Pade Vayasuku Nede Andina Kaanuka
Maate Raani Manasuku Yedo Theliyani Veduka
Puttadi Velugula Suryuni Roopam
Punnami Vennala Chandruni Roopam

Maguvala Nuditina Kumkuma Roopam
Manuvuku Mangala Sutram Roopam
Jaathi Pathakapu Ashoka Chakram Antati Kaanuka

Aade Pade Vayasuku Nede Andina Kaanuka

Naa Oohaku Oopiri Neevanana
Nee Oohala Uyala Nenanana
Chirakalam Neeke Chelimini Panche
Pachabottu Nenu Antu
Ninnu Anti Undana

Enni Sirulunna Enni Manulunna
Ee Nanem Pranam Le
Ninnu Nannu Yekam Chesina Ekathalam Le

Enni Nidhulunna Enni Sudhalunna
Suma Gandham Nuvvele
Andukunna Chandamamavu
Naaku Nuvve Le

Aade Pade Vayasuku Nede Andina Kaanuka
Maate Raani Manasuku Yedo Theliyani Veduka

Naa Kalalaku Roopam Neevanana
Nee Kavithaku Pranam Nenanana
Kalakalam Thodu Needaga Niliche
Kanti Paapa Nenu Antu
Chanti Papanavvana

Enni Kadalunna Enni Kalalunna
Mana Premoka Kaavyam Le
Neeku Nene Dasudinante
Kasi Chalavele

Enni Nuvvanna Enni Ne Vinna
Aakasham Haddele
Amruthale Kurise Vela
Pedavi Kande Le

Aade Pade Vayasuku Nede Andina Kaanuka
Maate Raani Manasuku Yedo Theliyani Veduka
Puttadi Velugula Suryuni Roopam
Punnami Vennala Chandruni Roopam
Maguvala Nuditina Kumkuma Roopam
Manuvuku Mangala Sutram Roopam
Jaathi Pathakapu Ashoka Chakram Antati Kaanuka

______________________

Song Credits:

పాట పేరు : ఆడే పాడే (Aade Pade)
సినిమా పేరు: సంక్రాంతి (Sankranthi)
సంగీత దర్శకుడు: S.A.రాజ్ కుమార్ (S.A.Raj Kumar)
సాహిత్యం: పోతుల రవికిరణ్ (Pothula Ravikiran)
గాయకులు: కార్తీక్ (Karthik), చిత్ర (Chitra)
దర్శకుడు: ముప్పలనేని శివ (Muppalaneni Shiva)
తారాగణం : వెంకటేష్ (Venkatesh), శ్రీకాంత్ (Srikanth), స్నేహ (Sneha), ఆర్తి అగర్వాల్ (Aarthi Agarwal), సంగీత (Sangeetha)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like