Home » ఆ పక్క మా అక్క వెన్నెల్లో గుమ్మాడి సాంగ్ లిరిక్స్ | బాబీ

ఆ పక్క మా అక్క వెన్నెల్లో గుమ్మాడి సాంగ్ లిరిక్స్ | బాబీ

by Lakshmi Guradasi
0 comments
Aa pakka maa akka vennello gummaadi song lyrics bobby

వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా వా వారేవా వవ్వారేవా

కళ్లల్లో ద్రాక్షరసం ఒల్లంతా చెరుకురసం పరువం దానిమ్మ రసం
చిట్టిపెదవి తేనె రసమ్రా వా వా దీన్ని పట్టబోతే పాదరసమ్రా
సూపు సపోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం
నీటుగాడు నిమ్మరసమ్రా వా వా వీడి కొంటేతనం సొంటిరసమ్రా
వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా

ఆ పక్క మా అక్క వెన్నెల్లో గుమ్మాడి
ఈ పక్క మా చెల్లి వెన్నెల్లో గుమ్మాడి
నడి మధ్యాన నేను వెన్నెల్లో గుమ్మాడి
నిదురోత మా గడిలో వెన్నెల్లో గుమ్మాడి

చిమ్మ చీకటిలోన కూకూకూ తిన్నగా
నా కాడికొచ్చి కూకూకూ
బుగ్గ నిమరగలవా నువ్వు మావ ముద్దులెట్టగలవా నువ్వు

తలుపు కిర్రుమనకుండా గురివింద గుమ్మాడి
కళ్లాలూ పోసిపెట్టూ గురివింద గుమ్మాడి
గొల్లాలు వేయకుండా గురివింద గుమ్మాడి
దగ్గరగా వేసిపెట్టూ గురివింద గుమ్మాడి

కాళ్ళ కింద ఎత్తుపీట కూకూకూ
పెట్టుకుని నిద్దరోతే కూకూకూ
గుర్తుపట్టి ముద్దులు పెడతా వా వా గుట్టంతా దోచుకుపోతా
వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా
వా వారేవా వవ్వారేవా

మీ అమ్మ మీ నాన్న గురివింద గుమ్మాడి
ఎదురుగా ఉండగానే గురివింద గుమ్మాడి
ఊరిజనమంతా గూడి గురివింద గుమ్మాడి
చూట్టానే ఉండగానే గురివింద గుమ్మాడి

అటు ఇటు చూడకుండా కూకూకూ తిన్నగా
నా కాడికొచ్చి కూకూకూ
వదిలిపెట్టకుండా నన్ను వా వా ఓడిసిపట్టగలవా నువ్వు

ఊరి చెరువులోన నువ్వు వెన్నెల్లో గుమ్మాడి
కలవపూలు కోత ఉండు వెన్నెల్లో గుమ్మాడి
మంచి నీళ్ల కోసం వచ్చి వెన్నెల్లో గుమ్మాడి
కాలు జారి కేకలేడతా వెన్నెల్లో గుమ్మాడి

కాపాడే గట్టు నువ్వు కూకూకూ నా నడుము పట్టుకుంటే కూకూకూ
అందరూ చూస్తుండగా నేను మావ ఒంటికదుముకుంటా నిన్ను

చూపు చూపు కలవాలని గురివింద గుమ్మాడి
తిరనాళ్లు వస్తాయంట వెన్నెల్లో గుమ్మాడి
ఇద్దరూ ఒక్కటవ్వాలని గురివింద గుమ్మాడి
ఎడిగినంట కందిచేను వెన్నెల్లో గుమ్మాడి

ఒత్తుకోకూడదని కూకూకూ
ఇసకమెత్తగుంటదంటా కూకూకూ
వయసుకొస్తే ఆడపిల్ల కూకూకూ
ఊరుకొతాది గోదారల్లే కూకూకూ
ఇచ్చి పుచ్చుకోవాలని కూకూకూ
కుర్రజంటే కోరుకుంటే కూకూకూ
తాటి చెట్టు చాటు చాలు వా వా తానేనన్నా

సూపు సపోట రసం వయసే బత్తాయి రసం నవ్వే నారింజ రసం
నీటుగాడు నిమ్మరసమ్రా వా వా వీడి కొంటేతనం సొంటిరసమ్రా
కళ్లల్లో ద్రాక్షరసం ఒల్లంతా చెరుకురసం పరువం దానిమ్మ రసం
చిట్టిపెదవి తేనె రసమ్రా వా వా దీన్ని పట్టబోతే పాదరసమ్రా

Song Credits:

పాట పేరు: వా వారెవ్వ
చిత్రం: బాబీ
గాయకులు : S.P. బాలసుబ్రహ్మణ్యం & సునీత ఉపద్రష్ట
సంగీతం: మణి శర్మ
సాహిత్యం: సుద్దాల అశోక్ తేజ
తారాగణం : మహేష్ బాబు, ఆర్తీ అగర్వాల్
దర్శకుడు: శోభన్
నిర్మాత : కె. కృష్ణ మోహన్ రావు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.