Home » ఇందురూడు చందురూడు (Indrudu Chandrudu) సాంగ్ లిరిక్స్ మాస్

ఇందురూడు చందురూడు (Indrudu Chandrudu) సాంగ్ లిరిక్స్ మాస్

by Rahila SK
0 comment

ఇందురూడు చందురూడు చూపుతోనె సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనె మత్తు మందు చల్లుతాడు
ఇందురూడు చందురూడు చూపుతోనె సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనె మత్తు మందు చల్లుతాడు

కారంగ నవ్వె నవ్వి చురకేసె పిల్లగాడు
కమ్మంగ చిట్క చేసి చుట్టు తిప్పుకున్నడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసె తుంటరోడు
చల్లంగ మస్క కొట్టి మనసే గుంచుకున్నడూ
వాలు చూసి వీలు చూసి ముగ్గులోకి దించినాడే
కాలికేస్తె వేలుకేసె మాయదారి చచ్చినోడే

ఓలమ్మో…ఓరయ్యో లే లేత గుమ్మడి పండె నా సొగసూ
వెన్నల్లే కరిగించి పులుసల్లె మరిగించాడె ఈ వయసూ
ఇంతందం ఎదురొచ్చి జివ్వంటు లాగేస్తె ఆగేదెలా
మోమాటం వదిలించి మోజంత కాజేస్త ఈ వేలా
అబ్బ ఏమి చెప్పనమ్మ చుప్పనాతి సోకులోడె
పైట చెంగు ఒంటి నిండ కప్పుకుంటె ఊరుకోడె
కందిరీగ నడుముకాడ తేనె కాటు వేసినాడె
పట్ట పగలె పిట్ట సోకు కొల్ల గొట్టు పోకిరోడె

ఓయమ్మో చిలకమ్మో చెయ్యైనా వెయ్యకముందె గిలిగింతా
నీ దుడుకే చూస్తుంటె సిగ్గెదొ కమ్మిందమ్మ ఒల్లంతా
ఇన్నాల్లూ ఊరించీ ఈనాడె సిగ్గంటె వేగేదెలా
ముద్దుల్లో ముంచెత్తి నీ దోర కుచ్చిల్లె లాగాలా
అయ్యొ రామ ఇంతలోనె ఎంత పని చేసినాడె
అందులోని ఇందులోని అంతులేని తొందరోడె
కొంత కాలం ఆగమన్న ఆగలేని కోడె గాడె
కోడి కూత వేల లోపె కొంప ఇట్ట ముంచినాడె

ఇందురూడు చందురూడు చూపుతోనె సూది గుచ్చి చంపుతాడు
అందగాడు అందగాడు మాటతోనె మత్తు మందు చల్లుతాడు
కారంగ నవ్వె నవ్వి చురకేసె పిల్లగాడు
కమ్మంగ చిట్క చేసి చుట్టు తిప్పుకున్నడు
మెల్లంగా మీసం దువ్వి మెలికేసె తుంటరోడు
చల్లంగ మస్క కొట్టి మనసే గుంచుకున్నడూ
వాలు చూసి వీలు చూసి ముగ్గులోకి దించినాడే
కాలికేస్తె వేలుకేసె మాయదారి చచ్చినోడే


పాట: ఇందురూడు చందురూడు (Indrudu Chandrudu)
గీత రచయిత: సాహితీ (Sahiti)
గాయకుడు: రంజిత్, కల్పన (ranjith, kalpana)
చిత్రం: మాస్ (2004)
తారాగణం: నాగార్జున, జ్యోతిక (Nagarjuna, Jyothika)
సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చూడండి.

You may also like

Leave a Comment