వర్షా కాలం వస్తే చాలు మన చుట్టు పక్కల అంతా దోమలు ఎక్కువగా వచ్చేస్తాయి. ఈ దోమలు కూడా కొంత మందినే ఎక్కువగా కుడుతుంటాయి. మన శరీరం లో జరిగే కొన్ని కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా దోమలు కొంత మంది మనుషులకు ఆకర్షితమవుతాయి. ఇప్పుడు దోమలు ఎక్కువగా ఎటువంటి మనుషులను కుడతాయో తెలుసుకుందాం రండి.
- ఆహరం అలవాట్లు:
మనం ఆహరం లో ఎక్కువగా చక్కర, మద్యంను ఎక్కువగా తీసుకున్నట్టు అయితే మన శరీరం లో కొన్ని డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి. వాటివల్ల దోమలు ఎక్కువ చక్కర, మద్యం తీసుకొనే వాళ్ళను కరుస్తాయి.
- శరీరం నుంచి వచ్చే చమట వాసన:
కొంత మందికి శరీరం నుంచి వచ్చే చమట ఎంతో దుర్గంధాన్ని ఇస్తుంది. అటువంటి మనుషులకు కూడా దోమలు ఎక్కువగా కుడతాయి.
- ఎక్కువ మెటబాలిజం:
కొంత మంది శరీరం ఎక్కువ మెటబాలిజం ప్రక్రియ జరుగుతుంది. మెటబాలిజం ఎక్కువ ఉన్న మనుషుల నుండి ఎక్కువ కార్బన్ డయాక్సైడ్ విడుదల అవుతుంది. ఎక్కువ మెటబాలిజం ఉన్న వారిని కూడా దోమలు బాగా కుడతాయి.
- వాపు మరియు రోగనిరోధక పనితీరు:
దీర్ఘకాలిక వాపు మరియు రోగనిరోధక శక్తీ బలహీనంగా ఉన్న వారి శరీరం లో జరిగే రసాయన ప్రక్రియ లో కొన్ని మార్పులు జరుగుతాయి. దోమలు వీరికి మరింత ఎక్కువగా ఆకర్షితమవుతాయి.
- గట్ మైక్రోబయోమ్:
సమతుల్య గట్ మీ చర్మ సూక్ష్మజీవిని ప్రభావితం చేస్తుంది, ముఖ్యంగా మిమ్మల్ని దోమలకు మరింత ఆకర్షణీయంగా చేస్తుంది.
మరిన్ని వాటి కోసం తెలుగు రీడర్స్ ఫ్యాక్ట్స్ ను సందర్శించండి .