Home » ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

ఓ బాటసారి (Oo Baatasari) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

by Vishnu Veera
0 comments
oo baatasari song lyrics Committee Kurrollu

ఓ బాటసారి ఏంటో నీ దారి
నీతో నువ్వు ఉంటె చాలు అంటవె
ఏకాంతంమంతా నీ సొంతమంటూ
మౌనలు వీడి రానంటావే
గతాలు గాయాలు చేదయినా నిజాలె
బాధైన సరెలే దాటి కాలంతో కొనసాగాలె

కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి
వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి
కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి
వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి

జీవితాన అసలైన దూరం రెండు గుండెలకు మధ్య దూరం ఏ మంచికో నీ కంచెలు
ఎంత వారికైనా పెద్ద భారం పంచుకోక తోడులేని భారం నీ చేతలే తలరాతలు
సర్దుకోవలె దిద్దుకొవలె నిన్నటి తప్పేది నీదైన
అందుకో రమ్మంటూ నువ్వు చెయ్యందిస్తే లోకమే కత్తులు దూసేనా

ఎంత లేసి విశ్వ గోళమయిన కవుగికంత చిన్నది అంట
గిరిగీతలే చెరిపేసుకో సాయమైన సాటివారికన్న
బంధువులు ఆప్తులు ఎవరు అంట నన్ను చూపును సరిచేసుకో
అందరూ నీవలె నీలాంటి వల్లె ఎవరివైనా కన్నిలె
నూరేళ్లు కొన్నాళ్ళే ఓ రోజు పోవాలె అందక ప్రేమను పంచాలే

కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి
కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి
వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి
కదిలి రా కలసి రా నచ్చి నలుగురిలో నవ్వై మెరిసి
వెలుగువై వెలికిరా తగని పంతాల పరదా తెరిచి


చిత్రం : కమిటీ కుర్రోళ్లు
సంగీతం: అనుదీప్ దేవ్
సాహిత్యం: సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి
గాయకుడు: PVNS రోహిత్
తారాగణం: సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాధ్ వర్మ, ప్రసాద్ బెహరా, మణికంఠ పరసు, లోకేష్ కుమార్ పరిమి, శ్యామ్ కళ్యాణ్, రఘువరన్, శివ కుమార్ మట్టా, అక్షయ్ శ్రీనివాస్

ప్రేమ గారడి (Prema Gaaradi) సాంగ్ లిరిక్స్ – కమిటీ కుర్రోళ్లు (Committee Kurrollu)

ప్రమోషనల్ సాంగ్ లిరిక్స్ (Committee Kurrollu Promotional Song) – కమిటీ కుర్రోళ్లు

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.