ఆహారంలో ఇంగువను చేర్చుకోవడం ద్వారా, ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరచవచ్చో తెలుసుకోవడానికి ఇది చదివేయండి. భారతీయ వంటలలో సాధారణంగా ఉపయోగించే మసాలా దినుసు ఇంగువ. ముఖ్యంగా పులిహోర లాంటి వంటలకు ఇంగువ లేకపోతే రుచే లేదు. రుచితో పాటూ ఇంగువ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.
రక్తపోటును తగ్గిస్తుంది: ఇంగువ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. గుండె సంబంధిత వ్యాధులు రాకుండా సాయపడుతుంది. చర్మ ఆరోగ్యం: ఇంగువలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి చర్మాన్ని నిగారింపజేస్తాయి మరియు దురదలు, దద్దుర్లు వంటి సమస్యలను తగ్గిస్తాయి. ఇంగువ నీటిని రోజూ తాగడం ద్వారా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
ఇంగువలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అంటువ్యాధులను నివారించడానికి, ఏవైనా గాయం అయితే తొందరగా నయం చేయడానికి సహాయపడతాయి. చర్మం అందం కోసం వాడే ఫేస్ ప్యాక్స్ లో చిటికెడు ఇంగువ వేసుకుని ముఖానికి రాసుకుంటే చర్మం ఆరోగ్యం కూడా పెరుగుతుంది.
శ్వాసకోశ ఆరోగ్యం: ఇంగువలో యాంటీ వైరల్ మరియు యాంటీబయాటిక్ లక్షణాలు ఉంటాయి, ఇవి ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారిస్తాయి. ఇంగువ నీరు తాగడం ద్వారా శ్వాస మార్గాలు క్లియర్ అవుతాయి, కఫం తగ్గుతుంది
ఇంగువలోని శోథ నిరోధక లక్షణాలు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు, ఇతర పిఎంఎస్ లక్షణాల నుండి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడతాయి. అలాగే పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా నియంత్రిస్తుంది.
ఒక అధ్యయనం ప్రకారం, ఇంగువను ఆయుర్వేద వైద్యంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాల కోసం చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు కూడా. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. దీనికున్న క్షార లక్షణం వల్ల కడుపులో అసిడిటీని, యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గిస్తుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.