Home » కోర కోర సూపుల కోమలాంగివే సాంగ్ లిరిక్స్ – రామ్ రాథోడ్(Ramu rathod)

కోర కోర సూపుల కోమలాంగివే సాంగ్ లిరిక్స్ – రామ్ రాథోడ్(Ramu rathod)

by Lakshmi Guradasi
0 comment

కోర కోర సూపుల కోమలాంగివే
కోరి వస్తున్న పిల్ల జర్రా ఆగవే
మల్లి.. మరదలా మల్లి

ఆమె: సుపుల్తో సుట్టాను సుందరాంగూడ
కోరింది దక్కేది ఎట్టా పిలడా
సూరి.. ఓ బావ సూరి..

ఉలుకు లేదు పలుకు లేదు
బాయి మీద గిరక లేదు
వలక మీద అలకలోయి
చిట్టి చిలక ఎగిరిరిపోయే…

అతడు: కోర కోర సూపుల కోమలాంగివే
కోరి వస్తున్న పిల్ల జర్రా ఆగవే
మల్లి.. మరదలా మల్లి

నల్ల నల్లని కళ్ళదాన నాజూకు పిల్లదాన
మల్లె పువ్వంటి మనస్సు నాకుందే చిన్నదాన

ఆమె: వద్దు వద్దు చిన్నవాడ ఒట్టి మాటలు ఇడ
నన్నే ఏకంగా మరువ నీతో నాకేంటి గొడవ

అతడు: పదిలంగా నన్ను చూడ చాటుకొస్తావు
పొత్తు చీకట్లో నడుమ కాపు కాస్తావు
ఏ తీరంలో ఎదురు వత్తె నన్ను చూడవు
ఎందుకే పిల్ల ఇట్లా బెట్టుచేస్తావు
కస్సు బస్సులాడబకు కన్ను ఎర్ర చేయబకు
ఈ చిన్నవాడిని చిన్నబుచ్చకు…..
మల్లి…మరదలా మల్లి…

కోర కోర సూపుల కోమలాంగివే
కోరి వస్తున్న పిల్ల జర్రా ఆగవే
మల్లి.. మరదలా మల్లి

ఆమె: కళ్లబుల్లి మాటలెనో చెబుతావు పిల్లగాడా
కదలకుండా నన్ను చూస్తే కాలం యిట్టే గడుపుతావు

అతడు: వాళ్ళు జాడల వయ్యారి మస్తుగున్న సింగారి
నిన్ను చూసి నిలవలేక నా గుండె చేజారె

తిపూలడి నన్ను ఎంత బాధపెడతావే
ఏంటా తిప్పుకొని నన్ను గోస పెట్టాకే

ఆమె: కుదురుకుంటే నిన్ను నేను కాదు అంటన
కలిసి బతకడానికి ఇంకా రాను అంటన
నాలుగుంట్లో నన్ను భజనాము చేయబకు
ఈ చిన్నదాన్ని బాధపెట్టకు…

అతడు: కోర కోర… సూపుల…

కోర కోర సూపుల కోమలాంగివే
కోరి వస్తున్న పిల్ల జర్రా ఆగవే
మల్లి.. మరదలా మల్లి

_______________________________________________________

లిరిక్స్ రైటర్: కళ్యాణ్సుమిత్ర
గాయకులు: రాము రాథోడ్ & శ్రీనిది
సంగీతం: రాజందరకొండ

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment