దాయి దాయి దామ్మ
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ
పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ
నా నిండు చందమామ
ఒహో హో ఒళ్ళో వాలుమా
ఒహో హో వయసే ఏలుమా
నిలువెల్లా విరబుసే
నవ యవ్వనాల కొమ్మ
తొలి జల్లై తడిమేసే
సరసాల కొంటెతనమా
హే దాయి దాయి దామ్మ
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొడపల్లి బొమ్మ
దాయి దాయి దామ్మ
పలికే గండు కోయిలమ్మ
నీపై మనసైందమ్మ
నా నిండు చందమామ
టకటక మంటు తలపును తట్టి
తికమక పెట్టే లుకుముకి పిట్ట
నిను వదిలితే ఎట్టా
నిలబడమంటూ నడుముని పట్టి
కితకిత పెట్టే మగసిరి పట్ట
కథ ముదిరితే ఎట్టా
కేరింతలాడుతు కవ్వించలేవా
కాదంటే ఇపుడు తప్పేదెలా
అరె కాదంటే ఇపుడు తప్పేదెలా
నీ కౌగిలింతకు జాలంటూ లేదా
ఏం దుడుకు బాబూ ఆపేదెలా
అయ్యో ఏం దుడుకు బాబూ ఆపేదెలా
ఒహో హో కోరిందే కదా
ఒహో హో మరీ ఇందిర
మరి కొంచెం అనిపించే
ఈ ముచ్చటంత చేదా
వ్యవహారం శృతిమించే
సుకుమారి బెదిరిపోదా
హాయే హాయే హాయే
అరెరే పైట జారిపోయే
పాప గమనించవే
మా కొంప మునిగిపోయే
పురుషుడినిట్టా ఇరుకున పెట్టే
పరుగుల పరువా సొగసుల బరువా
ఓ తుంటరి మగువా
నునుపులు ఇట్ట ఎదురుగ పెట్టా
ఎగబడ లేవా తగు జతకావ
నా వరసై పోవా
అల్లాడిపోకే పిల్లా మరీ
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
ఆ కళ్యాణ ఘడియ రానీయవా
అరె అందాక ఆగదు ఈ అల్లరి
నీ హితబోధలాపి శృతిమించవా
నీ హితబోధలాపి శృతిమించవా
ఒహో హో వాటం వారెవా
ఒహో హో ఒళ్లో వాలవా
అనుమానం కలిగింది
నువు ఆడపిల్లవేనా
సందేహం లేదయ్యో
నీ పడుచు పదును పైన
హే దాయి దాయి దామ్మా
కులికే కుందనాల బొమ్మ
నీతో పని ఉందమ్మా
నడిచే కొండపల్లి బొమ్మ
హే హే హే హాయే హాయే హాయే
కొరికే కళ్ళు చేరిపోయే
అయినా అది కూడా ఏదో
కొత్త కొంటే హాయే
పాట: దాయి దాయి (Daayi Daayi).
గీతరచయిత: సిరివెన్నెల సీతారామశాస్త్రి.
గాయకులు: K K – కృష్ణకుమార్ కున్నాత్, మహాలక్ష్మి అయ్యర్.
చిత్రం: ఇంద్ర (2002).
తారాగణం: ఆర్తి అగర్వాల్, చిరంజీవి, సోనాలి బింద్రే.
సంగీత దర్శకుడు: మణి శర్మ.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసంతెలుగు రీడర్స్ లిరిక్స్ను చుడండి.