Home » మీరు అల్సర్స్ తో బాధపడుతున్నారా?

మీరు అల్సర్స్ తో బాధపడుతున్నారా?

by Shalini D
0 comment

కడుపులో అల్సర్స్ తో బాధపడుతున్నారా? అయితే ఈ ఆహార నియమాలు పాటించి చూడండి. అల్సర్ తో బాధపడేవారు మాంసాహారం, స్పైసీ, ఫ్రైడ్ ఫుడ్స్, తేలికగా జీర్ణం కాని ఆహారాలకు దూరంగా ఉండాలి. దానిమ్మ, తేనె, బూడిద గుమ్మడికాయ, మజ్జిగ వంటివి డైలీ డైట్ లో చేర్చుకోవాలి. రోజూ అన్నంలో కొబ్బరి పాలు కలుపుకుని తింటే కడుపులో పుండ్లు నయమవుతాయి. క్యాబేజీ, కాకరకాయ, మునగాకును తరచూ ఆహారంలో చేర్చుకుంటే అల్సర్లు నయం అవుతాయి.

వెన్నను వేడినీళ్లు లేదా గంజి నీటిలో కలిపి తీసుకుంటే అల్సర్ల వల్ల కలిగే నొప్పి తగ్గుతుంది. యాపిల్ జ్యూస్, బీట్ రూట్ జ్యూస్ ను రోజూ తాగితే కడుపులో అల్సర్లు మాయమవుతాయి. ఉసిరికాయ నుంచి రసం తీసి మజ్జిగలో కలిపి 30 రోజుల పాటు తాగితే అల్సర్ తగ్గుముఖం పడుతుంది. ప్రతిరోజూ ఉదయం పరగడుపున, రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగితే అల్సర్లు, కడుపులో చికాకు సమస్యలు నయమవుతాయి.

తేనెలో నానబెట్టిన వెల్లుల్లిని తింటే అల్సర్లు నయమవుతాయి. వెల్లుల్లి బ్యాక్టీరియాను కూడా నిరోధిస్తుంది. మెంతి టీ, కలబంద మజ్జిగ తరచూ తాగాలి.అల్సర్లు ఉన్నవారు ఎక్కువగా నీరు తాగాలి.అప్పుడే కడుపులో చికాకు ఉండదు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment