Home » కోడి బంగారు గుడ్డు – నీతి కథ

కోడి బంగారు గుడ్డు – నీతి కథ

by Haseena SK
0 comment

ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు. వాడి దగ్గర ఒక కోడి ఉండేది. అది ప్రతి రోజు ఒక బంగారు గుడ్డు పెట్టేది. ఆ బంగారు గుడ్డుని అమ్ముకుని వాడు హాయిగా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. కాని కొంత కాలం గడిచిన తరువాత వాడికి చుట్టూ ప్రక్కల ఉండే ధనవంతుల్లో కెల్లా గొప్ప ధనవంతుడు కావాలని కోరిక కలిగింది. వెంటనే వాడికి ఒక ఆలోచన వచ్చింది. ఈ కోడి రోజు ఒక గుడ్డు ఇస్తోంది. దీని కడుపులో ఎన్నెన్ని గుడ్డు ఉన్నాయో. అవన్నీ నేను ఒకేసారి తీసుకుని గొప్ప ధనవంతుణ్ణి, అవ్వచ్చు గదా, దాని కడుపు కోసేసి ఆ గుడ్డున్నీ తీసేసుకుంటాను అని అనుకున్నాడు. ఆ ఆలోచన రావటమే తోరగా ఒక తీసుకుని బాతుని కడుపు కోసి చూశాడు లోపల ఒక గుడ్డు కూడా లేదు ఆ బాతు కాస్త చచ్చిపోయింది చక్కగా రోజుకు ఒక గుడ్డు తీసుకుని ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది గదా అని విచారించసాగాడు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ నీతి కథలు ను సందర్శించండి.

You may also like

Leave a Comment