Home » శివుడికి, విష్ణువుకి మధ్య భక్తి యుద్ధం

శివుడికి, విష్ణువుకి మధ్య భక్తి యుద్ధం

by Lakshmi Guradasi
0 comment

శివ వెర్సెస్ విష్ణు అంటే ఆ ఇద్దరికీ మధ్య యుద్ధం కాదు. ఆ ఇద్దరి భక్తుల మధ్య యుద్ధం. అవును మీరు విన్నది కరెక్టే. ఇది ఆల్రెడీ మనం దశావతారం మూవీ లో రాయిని మాత్రం సాంగ్ లో చూసే ఉంటాం. అసలు వాళ్ళిద్దరికీ ఏంటి గొడవ? దేనివల్ల ఇదంతా మొదలైంది? ఇదంతా అసలు ఎప్పుడు మొదలైంది? ఆ వినాశనానికి కారణం ఎవరు?

శైవులు మరియు వైష్ణవులు ..

మహావిష్ణువుని పూజించేవాళ్ళని వైష్ణవులు అంటారు. అలానే మహా శివుడిని పూజించేవాళ్ళని శైవులు అంటారు. వైష్ణవులు గురించి చెప్పాలంటే ముందుగా రామానుజాచార్యులు గురించి తెలుసుకోవాలి. రామానుజాచార్యులు వారు 11 వ శతాబ్ధంలో పుట్టారు. ఆయన పరమ విష్ణు భక్తుడు, అలానే ఆయన బోధనలకు జనాలు వైష్ణవ సంప్రదాయంలోకి మారిపోయేవారు.

ఇదంతా శివ భక్తులకి నచ్చేది కాదు. అసలైనా సనాతన ధర్మానికి సంబందించిన సూత్రాలు బోధాయన ధర్మ సూత్రాలను మూలంగా తీస్కుని ఉంచారు. ఆ బ్రహ్మ సూత్రం కాశ్మీర్ లో మాత్రమే ఉంది. వాటి మీద రామానుజాచార్యముల వారు తన ఉద్దేశం రచించడానికి కాశ్మీర్ లో అప్పట్లో పెద్ద లైబ్రరీ ఐన శారదా పీఠానికి తన శిష్యుడు కురేశ తో కలిసి వెళ్లారు.

అప్పట్లో కాశ్మీర్రాజు, రామానుజాచార్యులు వారు వస్తున్నారని తెలిసి అతనిని సత్కరించి తన ప్రదేశం లో ఉన్న శివ భక్తుల పండితులతో అష్టావధానం చర్చ కి పిలిచారు. ఆయన పిలుపుని గౌరవవించి రామానుజాచార్యులు వారు కురేశ తో కలిసి రాజు గారి ప్రదేశానికి వెళ్లారు. రామానుజాచార్యుల వారు వైష్ణవులు కావడం తో అక్కడ ఎవరు గెలుస్తారో అని అందరు ఆసక్తి గా చుస్తునారు. ఒక్కపక్క కాశ్మీర్ శివ పండితులు అందరు ఒక్కపక్క ఉన్నారు. ఇంకొక పక్క రామానుజాచార్యులు ఇంకా కురేశ మాత్రమే ఉన్నారు. ఆ పండితులు వాళ్ళ ప్రశ్నలు మొదలుపెట్టారు, దానికి రామానుజాచార్యులు వారు సమాధానం ఇస్తున్నారు. రాజు తో పాటు అందరికి ఎవరు గెలుస్తారు అనే కుతుహులం మొదలైంది. చివరికి రామానుజాచార్యులు వారు చాలా సులువుగా గెలిచారు. తన ఉద్దేశాన్ని రాయడానికి బ్రహ్మ సూత్రాల గ్రంధం ఇవ్వమని అడిగారు.

ఆ గ్రంధం లో లోపాలని ఎత్తి చూపితే తన వాక్యాల తో శివమతం నాశనం అవుతుందని భయం తో ఆ గ్రంధం మొత్తం చెదలు పట్టి పాడైపోయిందని చెప్తారు. చేసేదేం లేక వాళ్ళు తిరిగి వెళ్తుండగా సరాసరి శారద దేవి మాత వచ్చి ఆ గ్రంధాన్ని రామానుజాచార్యుల వాళ్ళకి ఇచ్చి అక్కడ నుండి వెళ్లిపొమ్మని అరిచింది. ఆవిడ చెప్పినట్టు వాళ్ళ వెంటనే బయలుదేరారు.

తరువాత ఆ గ్రంధం కనపడకపోవడం తో కాశ్మీర్ రాజు కి తెలిపారు. తాను వాళ్ళ భటులతో ఎలాగైనా ఆ గ్రంధం తెస్కురామని అరిచారు .భటులు వాళ్ళని పట్టుకుని ఆ గ్రంధాన్ని తీసుకొచ్చేశారు. రామానుజాచార్యులు వారు బాధతో తిరిగి వెళ్ళారు. కొన్ని రోజులు అయ్యాక కురేశ ఒక పుస్తకాన్ని తీసుకొచ్చి రామానుజాచార్యుల కి ఇచ్చారు.అదేం పుస్తకం అని చూస్తే కాశ్మీర్ లో శారద పీఠం లో ఉన్న బ్రహ్మ సూత్రాలు అని ఆ పుస్తకం లో వున్నాయి. ఎలా అని అడిగితే ? భటులు వచ్చి గ్రంధం తీసుకుని వెళ్ళ్లేలోగా నేను ఆ గ్రంధం లో ఉన్న సారాంశాన్ని చదివి గుర్తుపెట్టుకున్న అన్నాడు. అనందంతోగురువు శిస్యుడిని ఆశీర్వదించారు.

శ్రీ భాష్యం పుస్తక రచనకు కారణం ..ఆ తర్వాత రామానుజాచార్యులు వారు బ్రహ్మ సూత్రాలను పూర్తిగా పాటించి వాటి ఫై శ్రీ భాష్యం ని రచించారు. కాశ్మీర్ పండితులని ఓడించిన రామానుజాచార్యులు వారు దేశం అంత పేరు ప్రసిద్ధిని పొందారు. దానితో చాల మంది వైష్ణవ మతం లోకి చేరుతున్నారు.

వైష్ణవ విగ్రహాల ద్వాంసానికి కారణం:

తమిళనాడు లో గంగైకొండ చోళపురం క్రిమికంఠుడు అనే రాజు ఉండేవాడు. అతను మహాశివుడు పరమ భక్తుడు. దానివల్ల తన రాజ్యం లో శివుడిని మాత్రమే పూజించాలని ఆదేశించాడు. కొంతమంది రాజు శిక్షిస్తాడేమో అని శివుడిని పూజించేవారు ఇంకొంతమంది రాజు కి తెలియకుండా వాళ్ళ ఇష్టా దైవాన్ని పూజించేవారు. ఇవ్వన్నీ తెలుసుకున్న రాజు తన రాజ్యం లో ఉన్న వైష్ణవ గుడిని ద్వాంసం చేయడం ప్రారంభించాడు. ఆలా కొన్ని విగ్రహాలను ద్వాంసం చేసాడు. అందులో భాగం గా చిదంబరం లో గోవిందా రాజు స్వామి విగ్రహాన్ని సముద్రం లో పడేసాడు. ఈ విగ్రహం దశావతారం లో చూపిస్తారు. ఆలా చేసిన తర్వాత జనల మనసు లో పూర్తిగా విష్ణువుని చెరిపెయ్యాలని అనుకున్నాడు. అందుకే అప్పుడు శ్రీరంగం లో ఉంటున్న రామానుజాచార్యులు వారి చేత తన శిస్యుడు చేత శివుడి కన్నా ఎవ్వరు గొప్ప కాదు అని చెప్పిస్తే అందరు అదే నమ్ముతారని భావించి తన ఆశ్రమానికి రాజు భటులను పంపుతాడు. అదంతా తెలిసి కురేశ భటులతో కలిసి వెళ్లాడు.

కురేశ తెలివి ..

భటులకి తానే రామానుజాచార్యులు అని చెప్పాడు. వెంటనే భటులు కురేశ ని అలానే రామానుజాచార్యులు గురువు పెరియానంబర్ ని బంధించి క్రిమికంఠుడు దెగ్గరికి తీస్కుని వెళ్తారు. అక్కడ జరిగిన చర్చలో కూడా కురేశ వాళ్ళు గెలవడం తో క్రిమికంఠుడు కి కోపం వచ్చింది. ఈశ్వరుడికన్నా ఎవరు గొప్ప కాదు అని వాళ్ళు ఒప్పుకుంటున్నటుగా ఒక లేఖ ని తాయారు చేసి అందులో సంతకం చెయ్యమని బెదిరిస్తాడు. ఇంకా వేరే దారి లేఖ కురేశ అందులో ఉన్నది చదువుతాడు. అందులో శివత్పరంతరం నాస్తి అని ఉంటుంది.అంటే శివుడికన్నా గొప్ప ఎవరు లేరు అని. దానికి కురేశ ద్రోణం ఆస్థి తతఃపరం అని కలిపి సంతకం చేసాడు. అంటే మొత్తం మీనింగ్ శివుడి కన్నా ఎవరు గొప్ప కాదు కానీ విష్ణువు అతనికన్న గొప్ప అని.

అది చూసి క్రిమికంఠుడు కోపం తో తన కన్నులు పీకేయమని ఆదేశిస్తాడు. ఆలా కురేశ తన గురువుని కాపాడుకుంటాడు. విషయం తెల్సిన వైష్ణవులు అసలైన రామానుజాచార్యుల వారిని అడవి నుండి తీరు నారాయణపురం కి పంపేశారు.అదే ఇప్పుడు మేలుకోటే. అక్కడే అతను 12 సంత్సరాలు ఉన్నారు. ఆ తర్వాత ఆ రాజు చనిపోయాడు.

ఆ తర్వాత రామానుజాచార్యులు శ్రీ రంగానికి వచ్చి అక్కడే మోక్షాన్ని చేరుకున్నారు. ఇప్పుడు అదే శ్రీ రంగం గుడిలో ఆయన మానవ దేహం, ఏవో కొన్ని కలపడం వాళ్ళ 1000 సంత్సరాలు అయినా అలానే వుంది. చాల మంది ఇప్పుడికి ఆ దేహాన్ని చూడడానికి ఎక్కడెక్కడినుంచో వస్తారు.

మనషుల మధ్య బేధాలు రావడం తో శైవులని, విష్ణువులుని విడిపోయారు. అంతేకాని శివుడికి, విష్ణువుకి ఏ యుద్ధం జరగలేదు.

మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ భక్తి ను చుడండి.

You may also like

Leave a Comment