Home » శెనిగ చెన్ల నిలబడి చేతులీయవే సెందురాల సాంగ్ లిరిక్స్ – జానపద పాట

శెనిగ చెన్ల నిలబడి చేతులీయవే సెందురాల సాంగ్ లిరిక్స్ – జానపద పాట

by Vinod G
8K views

అరె శెనిగచెన్ల నిలబడి చేతులీయవే సెందురాల తు బాల చేతులీయవే సెందురాల తు బాల
సేతులియ్య నీతో నాకు సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష సెల్లెళ్ళున్నర్రో మాయ దారి మల్లేష

అరె బంతితోట్లో నిలవడి బాసలాడవే సెందురాల తు బాల బాసలాడవే సెందురాల తు బాల
బాసలాడ నీతో నాకు బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష బావళ్ళున్నర్రో మాయ దారి మల్లేష

నా అరటితోట్లో కలుసుకొని ఆటలాడవే సెందురాల తు బాల ఆటలాడవే సెందురాల తు బాల
ఆటలాడ నీతో నాకు అక్కలున్నర్రో మాయ దారి మల్లేష అక్కలున్నర్రో మాయ దారి మల్లేష

ఎయ్ పత్తిచెన్ల పక్కకొచ్చి పలకరియ్యావే సెందురాల తు బాల పలకరియ్యావే సెందురాల తు బాల
పలకరియ్య నీతో నాకు పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష పాలేళ్ళున్నార్రో మాయ దారి మల్లేష

అరె కందిచెన్ల నిలవడి కన్నుకొట్టవే సెందురాల తు బాల చేయ్యివట్టవే సెందురాల తు బాల
కన్నుకొట్ట నీకు నాకు వరస కాదురో మాయ దారి మల్లేష వరస కాదురో మాయ దారి మల్లేష

మిరపతోట్లో నిలవడి మాటలియ్యవే సెందురాల తు బాల మాటలియ్యవే సెందురాల తు బాల
మాటలియ్య నీతో నాకు మామలున్నర్రో మాయ దారి మల్లేష మామలున్నర్రో మాయ దారి మల్లేష

అబ్బ బ్బ మక్కచెన్ల మంచ మీద సరసమాడవే సెందురాల తు బాల సరసమాడవే సెందురాల తు బాల
సరసమాడ నువ్వు నాకు బావ కాదురో మాయ దారి మల్లేష బావ కాదురో మాయ దారి మల్లేష

నువ్వు నిమ్మతొట్లో నిలవడి నిజం చెప్తనే సెందురాల తు బాల నిజం చెప్తనే సెందురాల తు బాల
నిజం చెప్తే నిన్ను నేను నమ్మలేనురో మాయ దారి మల్లేష నమ్మలేనురో మాయ దారి మల్లేష

వట్టి మాటలు కాదె పిల్ల మనువాడుతునే సెందురాల తు బాల మనువాడుతునే సెందురాల తు బాల
మనువాడుతనంటే నేను నీతో వస్తారో మాయ దారి మల్లేష నీతో వస్తారో నా బావ మల్లేష

చలో ఏడడుగులు యేసి మనం కలిసి ఉందమే సెందురాల తు బాల కలిసి ఉందమే సెందురాల తు బాల
నీ మాట నేను వింటా నీతో ఉంటానోయ్ మాయ దారి మల్లేష నీతో ఉంటానోయ్ నా బావ మల్లేష

అరె నిన్నేలువట్టుకుంటా ఇడిసివుండెనే సెందురాల తు బాల ఇడిసివుండెనే సెందురాల తు బాల..

మరొక కొత్తగా వచ్చిన జానపద పాట : ఓ పిల్లగా యంకటేషు (O PILAGA VENKATI) సాంగ్ లిరిక్స్

మరిన్ని పాటల లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.