Home » బేకింగ్ సోడా ఆరోగ్యానికి మంచిదా?

బేకింగ్ సోడా ఆరోగ్యానికి మంచిదా?

by Shalini D
0 comment

బేకింగ్ సోడాను వంట సోడా అని పిలుచుకుంటారు. దీన్ని ఎన్నో రకాల వంటకాల్లో కలుపుతారు. పకోడీ, బజ్జీల తయారీలో వీటిని వాడతారు. అలాగే ఇడ్లీలు మెత్తగా వచ్చేందుకు కూడా వంటసోడా వాడతారు. వంటసోడా నిత్యం వాడడం వల్ల ఎన్నో రకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

బేకింగ్ సోడా తరచూ తినడం వల్ల దంతాల అనామెల్ దెబ్బతింటుంది. బేకింగ్ సోడాలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది అధికంగా తింటే వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి. మూర్ఛలు వచ్చే అవకాశం పెరుగుతుంది. అధికంగా తింటే మూత్రపిండా వైఫల్యం కూడా పెరిగే అవకాశం ఉంది. ఇది గ్యాస్ ను అధికంగా ఉత్పత్తి చేస్తుంది. చాలా మంది బేకింగ్ సోడాతో దంతాలు తోమడం వంటివి కొంతమంది చేస్తుంటారు. కానీ ఇది మంచి పద్ధతి కాదు.

నేటి వంటకాల్లో బేకింగ్ సోడా వాడకం బాగా పెరిగింది. బేకింగ్ సోడా ఆరోగ్యానికి మంచిదా? ప్రత్యామ్నాయంగా మరేదైనా ఉపయోగించవచ్చా? అనే సందేహాలు ఎంతో మందిలో వస్తాయి. ముఖ్యంగా పకోడీ, బజ్జీలు, పునుకుల వంటకాల్లో వంటసోడాను కలుపుతూ ఉంటారు. అలాగే ఇడ్లీ పిండిలో కూడా కొంతమంది కలుపుతూ ఉంటారు.

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment