హాయ్ తెలుగు రీడర్స్ ! వర్షాకాలం రాగానే వాతావరణం చల్లగా ఉంటుంది. దానికి తోడు వరుసగా పడుతున్న వర్షాల కారణంగా వాతావరం మరింత చల్లగా ఉంటుంది. ఇలాంటప్పుడు సహజంగానే జలుబు, దగ్గు, జ్వరం పలకరిస్తుంటాయి. కానీ ఈ జలుబు, దగ్గు, జ్వరం వంటివి గర్భిణులకు వస్తే వారి పరిస్థితి మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఇటువంటి సమస్యల నుండి మనం రిలీఫ్ పొందాలంటే కొన్ని టిప్స్ తప్పక పాటించాల్సిందే.
గర్భిణిగా ఉన్నప్పుడు తరచూ మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. అలాగని నీరు తాగకుండా ఉండకూడదు. గోరు వచ్చని నీటితో పాటు విటమిన్స్ ఎక్కువగా లభించే పండ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది.
జలుబు రావడానికి ముందే గొంతు నొప్పిగా అనిపిస్తుంది. అప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. వేడినీటితో రెండు నిమిషాలు అవిరి పడితే చాలావరకూ ఉపశమనం కలుగుతుంది. అలాగే గురువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించినా గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.
నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన న్యూట్రియంట్స్ అందుతాయి. అంతేకాకుండా దగ్గు కూడా అదుపులోకి వస్తుంది.
ఈ సమయంలో మామూలుగానే కాస్త మత్తుగా అనిపిస్తుంది, కాబట్టి వీలైనంత ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి. కాస్త తల ఎత్తుగా పెట్టుకొంతే శ్వాస ఇబ్బందులు ఉండవు. రాత్రీ నిద్ర పోయే ముందు పాలల్లో పసుపు వేసుకొని తాగితే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ ను సందర్శించండి.