Ole Sandhamama lyrics Gandhi Tatha Chettu Divya Maalika

గాంధీ తాత చెట్టు – ఓలే చందమామ పాట లిరిక్స్ | Ole Sandhamama Lyrics

by Lakshmi Guradasi

Song Credits:

సాంగ్ : ఓలే చందమామ (Ole Sandhamama)
ఆల్బమ్/సినిమా: గాంధీ తాత చెట్టు (Gandhi Tatha Chettu)
నటులు: సుకృతి వేణి బండ్రెడ్డి (Sukriti Veni Bandreddi), ఆనంద చక్రపాణి (Ananda Chakrapani), రాగ్ మయూర్ (Rag Mayur), భానుప్రకాష్ (Bhanuprakash)
సంగీతం: రీ (Ree)
గాయకుడు: దివ్య మాలిక (Divya Maalika)
లిరిక్స్ : కాసర్ల శ్యామ్ (Kasarla Shyam)
రచన & దర్శకత్వం: పద్మావతి మల్లాది (Padmavathi Malladi)

Ole Sandhamama lyrics Gandhi Tatha Chettu in Telugu

సిరిలచ్చిమీ లాంటి నీ మోము మీద… ఓలే చందమామ
చింతాకు బొట్టెంతో అందంగా ఉంటదే అంటది అమ్మ
చెరువుల్లా చాపల్లా దుంకేటి కండ్లకు… ఓలే చందమామ
అల్లాని కాటుక నజరెంతో అందం అంది చిన్నమ్మ

తుమ్మిద కురులకు… ఓలే చందమామ
పూలెంతో అందమే అంటాడు మావా
చెవులకు దుద్దులు అచ్చంగా అందం అంటాడే అయ్యా
అసలు అందమేదే… ఓలే చందమామ
ఓలే చందమామ… ఓలే చందమామ… ఓలే చందమామ…

గాజులు పట్టిలు తీరొక్క బట్టలు
దువ్వెన్లు పౌడర్లు వాసన నూనెలు
జడల పువ్వులోలే ఒక్కరోజులోనే వాడిపోతాయోయమ్మ…

ఏ బెదురూ లేని మొహమే అందం… ఓలే చందమామ
కండ్లల్ల మెరుపు కలకాలం అందం… ఓలే చందమామ
గుండెల్లా ధైర్యం అసలైన అందం… ఓలే చందమామ
పట్టిన పట్టు సిసలైన అందం… ఓలే చందమామ

నువ్వు నమ్మిన దారి నీకెంతో అందం
నీకు నచ్చిన తోవ నీకెంతో అందం
సొంత కాళ్ల మీద నిలుసుంటే అందం
చేతనైన సాయమే కొత్త అందం… ఓలే చందమామ

ఓలే చందమామ… ఓలే చందమామ… ఓలే చందమామ…

Ole Sandhamama lyrics Gandhi Tatha Chettu in English

Sirilachhimi Laanti Nee Momu Meeda… Ole Chandamaama
Chintaaku Botte Tho Andangaa Untade Antadi Amma
Cheruvullaa Chaapallaa Dunketi Kandlaku… Ole Chandamaama
Allaane Kaatuka Nazaretho Andam Andi Chinnamma

Thummida Kurulaku… Ole Chandamaama
Pooletho Andame Antaadu Maavaa
Chevulaku Duddulu Achchamgaa Andam Antaade Ayyaa
Asalu Andamedee… Ole Chandamaama
Ole Chandamaama… Ole Chandamaama… Ole Chandamaama…

Gaajulu Pattilu Theerokka Battalu
Duvvenlu Powderlu Vaasana Noonelu
Jadala Puvvulole Okkarojulone Vaadipotaayoyamma…

Ye Beduru Leni Mohame Andam… Ole Chandamaama
Kandlalla Merupu Kalakaalam Andam… Ole Chandamaama
Gundellaa Dhairyam Asalaina Andam… Ole Chandamaama
Pattina Pattu Sisalaina Andam… Ole Chandamaama

Nuvvu Nammina Daari Neekentho Andam
Neeku Nachchina Thova Neekentho Andam
Sontha Kaalla Meeda Nilusunte Andam
Chethanaina Saayame Kotha Andam… Ole Chandamaama

Ole Chandamaama… Ole Chandamaama… Ole Chandamaama

Read also: Dhagad Pilla lyrics

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like