Home » మానవ జీవితం లో నీటి యెక్క ప్రాముఖ్యత

మానవ జీవితం లో నీటి యెక్క ప్రాముఖ్యత

by Nithishma Vulli
0 comment

మానవ జీవితం లో నీరు ఎంతో అవసరం, నీరు లేకపోతే ఏ ప్రాణి కూడా ఈ భూమి మీద నివశించే వీలు లేదు. మానవ శరీరం లో మొత్తం 70% వరకు నీరు ఉంటుంది, అంతే కాదు మానవ శరీరంలోని వ్యవస్థలు అన్ని నీటి మీదే ఆధారపడి ఉంటుంది.అయితే నీరు రోజుకి ఎంత తాగాలి, నీరు ఎలా తీసుకోవాలి, నీరు తాగడం వలన కలిగే ఉపయోగాలు, సరిపడా నీళ్లు తాగకపోతే కలిగే నష్టాలు, నీరు ఎక్కువుగా తాగితే కలిగే నష్టాలు, పై అంశాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం.

importance of water

రోజుకి ఎంత నీరు తాగాలి ?

మనం ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి రోజూ తగినంత నీరు తాగడం తప్పనిసరి. మనం ఎన్ని నీళ్లు తాగాలి అనేది మన వయసు, జెండర్, ఉష్ణోగ్రత, శరీరిక శ్రమ, వాతావరణం, మనిషి యొక్క బరువు మొదలైన వాటి మీద ఆధారపడి వుటుంది . సాధారణం గా ప్రతి వ్యక్తి 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగాలి. రోజుకి 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటారు.

నీరు ఎలా తీసుకోవాలి?

నీళ్లు తాగేటప్పుడు అందరూ తొందరగా తాగేస్తారు, కానీ అలా తాగడం శరీరానికి మంచిది కాదు. నీళ్లు ఎప్పుడు నిదానంగా తాగాలి. అంతే కాదు రాగి బిందెలో నిల్వ చేసిన నీరు తీసుకోవాలి ఎందుకంట, ఆ నీటిలో వ్యాది నిరోధక శక్తిని పెంచే పోషకాలు ఎక్కువ గా ఉంటాయి. రాగి బిందెలు లేని వాళ్ళు మట్టి కుండలోని నీళ్లు తీసుకోవాలి, ఎందుకంటె కుండ, నీటిని పరిశుభ్రం చేస్తుంది. దాదాపు రోగాలన్నీ నీటి ద్వారానే వస్తాయి కాబట్టి మనం పరిశుభ్రమైన నీటిని మాత్రమే తాగాలి.

నీరు తాగడం వలన కలిగే ఉపయోగాలు:

  1. కణాలకు పోషణ, ఆక్సిజన్ పంపిణీ చేస్తుంది.
  2. మూత్రాశయం, శరీరం నుండి మురికిని (బాక్టీరియా, టాక్సిన్స్) తొలగిస్తుంది.
  3. మలబద్ధకాన్ని నివారిస్తాయి.
  4. బీపీని కంట్రోల్‌లో ఉంచుతుంది.
  5. శరీర భాగాలు, కణజాలాలను రక్షిస్తుంది.
  6. శరీర ఉష్ణోగ్రతను నిలకడగా ఉంచుతుంది .
  7. శరీరంలో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తుంది.
  8. రక్తాన్నిశుద్ధిచేస్తుంది.
  9. చర్మ సమస్యలను నివారించి, చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.
  10. ఒంటిలోని కొవ్వును కరిగించడానికి ఉపయోగపడుతుంది.

సరిపడా నీళ్లు తాగకపోతే కలిగే నష్టాలు:

  1. కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయి.
  2. రక్తప్రసరణ సమస్యలు వస్తాయి.
  3. శరీర ఉష్ణోగ్రత పెరగడం.
  4. జీర్ణ సంబంధమైన సమస్యలు.
  5. శరీరం తాజాదనాన్ని కోల్పోవడం.
  6. అధిక బరువు.
  7. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వస్తాయి.
  8. వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

నీరు ఎక్కువుగా తాగితే కలిగే నష్టాలు:

  1. ఓవర్‌హైడ్రేషన్‌కు దారితీస్తుంది.
  2. తరచుగా మూత్రవిసర్జన.
  3. శరీరంలో ఎలక్ట్రోలైట్స్ లేకపోవడం.
  4. వికారం, చేతులు, కాళ్ల రంగులో మార్పు.
  5. కండరాల తిమ్మిరి, తలనొప్పి, అలసట వంటి సమస్యలు వస్తాయి.
  6. కిడ్నీలోని క్రీయటిన్ లెవల్ పెరగడం.

ముగింపు:

నీరు ప్రతిరోజు జీవితానికి ప్రముఖ పాత్రని ప్రదర్శిస్తుంది. మానవ ఆరోగ్య మరియు సామాజిక సంతోషానికి మూలాధారమైనది, వివిధ శరీరిక ప్రక్రియలను మరియు కార్యకలాపాలను ప్రభావించేది. వ్యక్తిగత ఆరోగ్యం, సామాజిక సంవాదానికి మరియు పర్యావరణం రక్షించేది. భూమి మీద ఎం చెయ్యాలన్నా, నీరు ఎంతో అవసరం, నీరు లేనిదే మానవ జీవితం లేదు. మరింత సమాచారం కోసం

ఇలాంటి మరిన్ని వాటి కొరకుతెలుగు రీడర్స్ టిప్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment