Home » మీ బాడీ టైప్ ప్రకారం డ్రెస్సింగ్: టాలీవుడ్ హీరోల స్టైల్ సీక్రెట్స్

మీ బాడీ టైప్ ప్రకారం డ్రెస్సింగ్: టాలీవుడ్ హీరోల స్టైల్ సీక్రెట్స్

by Lakshmi Guradasi
0 comments
perfect dressing for mens body types

చాలామంది ఆన్‌లైన్ సైట్లలో ఏదైనా అవుట్‌ఫిట్ చూసి, అది మోడల్‌కు బాగుందని కొనేస్తుంటారు. కానీ అది మనం వేసుకునేసరికి సరిగ్గా సెట్ అవ్వదు. దీనికి ప్రధాన కారణం బాడీ టైప్ (Body Type). ప్రతి ఒక్కరి శరీరాకృతి వేరుగా ఉంటుంది, కాబట్టి అందరికీ అన్ని రకాల దుస్తులు నప్పవు. ఈ ఆర్టికల్ లో, బాడీ టైప్‌ను ఎలా గుర్తించాలి మరియు రెక్టాంగులర్ బాడీ టైప్, ట్రయాంగులర్ బాడీ టైప్, ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ టైప్, ట్రెపిజాయిడ్ బాడీ టైప్, మరియు ఓవల్ బాడీ టైప్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.

స్టైలింగ్‌లో కీలక సూత్రాలు: బాలెన్సింగ్ మరియు ఇల్యూషన్ సరైన డ్రెస్సింగ్ అనేది ప్రధానంగా రెండు అంశాల మీద ఆధారపడి ఉంటుంది: ఒకటి బాలెన్సింగ్ (Balancing), రెండోది ఇల్యూషన్ (Illusion). మన శరీరంలో ఏ భాగం అయితే తక్కువ వెడల్పుగా ఉందో, అక్కడ బట్టల ద్వారా వెడల్పుగా ఉన్నట్టు భ్రమ (Illusion) కల్పించి, శరీరాన్ని సమతుల్యం (Balance) చేయడమే స్టైలింగ్ రహస్యం.

సాధారణంగా పురుషులలో ఐదు రకాల బాడీ టైప్స్ ఉంటాయి:

  1. రెక్టాంగులర్ (Rectangular)
  2. ట్రయాంగులర్ (Triangular)
  3. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ (Inverted Triangle)
  4. ఓవల్ (Oval)
  5. ట్రెపిజాయిడ్ (Trapezoid)
how to dress for your body type men

1. రెక్టాంగులర్ బాడీ టైప్ (Rectangular Body Type) : మీ షోల్డర్స్ (భుజాలు), చెస్ట్ (ఛాతి), వేస్ట్ (నడుము), మరియు హిప్స్ (కటి భాగం) అన్నీ దాదాపు ఒకే వెడల్పులో ఉంటే అది రెక్టాంగులర్ బాడీ టైప్.

  • సెలబ్రిటీ ఉదాహరణలు: మహేష్ బాబు, తలపతి విజయ్, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ ఈ బాడీ టైప్‌కు చెందినవారే.
  • టాప్స్: వీరు భుజాల వద్ద వెడల్పు పెరిగినట్టు కనిపించేలా హెన్లీ (Henley) టీ షర్ట్స్ లేదా ఛాతిపై పాకెట్స్ ఉన్న షర్ట్స్ వేసుకోవాలి. ఇది ఛాతి వెడల్పుగా ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది.
  • లేయరింగ్: టీ షర్ట్ మీద జాకెట్స్ వంటివి వేయడం వల్ల శరీరానికి మంచి స్ట్రక్చర్ వస్తుంది.
  • బాటమ్స్: మరీ టైట్‌గా కాకుండా, స్ట్రెయిట్ లేదా రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్ వాడాలి. మిడ్-రైజ్ లేదా హై-రైజ్ ప్యాంట్స్ వీరికి బాగా సెట్ అవుతాయి.
  • రంగులు & పాటర్న్స్: పైన లైట్ కలర్స్, కింద డార్క్ కలర్స్ వేసుకోవడం వల్ల పైన ఫోకస్ పెరుగుతుంది. వీరు హారిజాంటల్ (అడ్డ) లైన్స్ ఉన్న దుస్తులు ధరిస్తే లావుగా, వెడల్పుగా కనిపిస్తారు.

2. ట్రయాంగులర్ బాడీ టైప్ (Triangular Body Type):  మీ షోల్డర్స్ మరియు చెస్ట్ వెడల్పు కంటే, మీ హిప్స్ మరియు వేస్ట్ లైన్ వెడల్పు ఎక్కువగా ఉంటే అది ట్రయాంగులర్ బాడీ టైప్.

  • సెలబ్రిటీ ఉదాహరణలు: పవన్ కళ్యాణ్, దుల్కర్ సల్మాన్, విశ్వక్ సేన్ ఈ బాడీ టైప్‌కు దగ్గరగా ఉంటారు.
  • డ్రెస్సింగ్ టిప్స్: వీరు భుజాల వద్ద విడ్త్ పెంచడం ముఖ్యం. అందుకే షోల్డర్ ప్యాడెడ్ జాకెట్స్ లేదా షోల్డర్ సీమ్ ఉన్న షర్ట్స్ వాడాలి.
  • బాటమ్స్: థైస్ (తొడలు) పెద్దగా ఉంటాయి కాబట్టి, వాటిని హైలైట్ చేయకుండా ఉండటానికి కింద ఎప్పుడూ డార్క్ కలర్ ప్యాంట్స్ వేసుకోవాలి.
  • యాక్సెసరీస్: వీరికి టై (Tie) ధరించడం అనేది ఒక గొప్ప ఆప్షన్. ఎందుకంటే ఇది ఫోకస్‌ని ఛాతి వైపు మళ్ళించి, నిలువుగా ఉన్నట్టు ఇల్యూషన్ ఇస్తుంది.
  • పాటర్న్స్: రెక్టాంగులర్ బాడీకి భిన్నంగా వీరు వర్టికల్ (నిలువు) లైన్స్ ఉన్న షర్ట్స్ వాడాలి.

3. ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ (Inverted Triangle Body Type) : ఈ బాడీ టైప్‌లో భుజాలు చాలా వెడల్పుగా ఉంటాయి, అక్కడి నుండి నడుము వైపు వచ్చేసరికి శరీరం సన్నబడుతుంది. దీనిని పర్ఫెక్ట్ మాస్క్యులైన్ (మగతనం ఉట్టిపడే) లుక్ అని చెప్పవచ్చు.

  • సెలబ్రిటీ ఉదాహరణలు: టాలీవుడ్‌లో ప్రభాస్, రానా దగ్గుబాటి మరియు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్.
  • టాప్స్: వీరికి ఇప్పటికే భుజాలు వెడల్పుగా ఉంటాయి కాబట్టి, భుజాల వద్ద ప్యాడింగ్ ఉండే బట్టలు అస్సలు వేసుకోకూడదు. సాఫ్ట్ షోల్డర్స్ ఉన్న షర్ట్స్ లేదా జాకెట్స్ వీరికి బాగా సెట్ అవుతాయి.
  • బాటమ్స్: పైన వెడల్పుగా, కింద సన్నగా ఉండటం వల్ల శరీరాన్ని బాలెన్స్ చేయడానికి వీరు రిలాక్స్డ్ ఫిట్ (Relaxed fit) లేదా ప్లీటెడ్ ప్యాంట్స్ (Pleated pants) వాడాలి. ఇవి కాళ్ళ వద్ద వాల్యూమ్ పెరిగినట్టు చూపిస్తాయి.
  • కలర్స్ & ప్రింట్స్: వీరు పైన డార్క్ కలర్స్, కింద లైట్ లేదా బ్రైట్ కలర్స్ వేసుకోవాలి, తద్వారా ఫోకస్ కిందకి వెళ్తుంది. చెస్ట్ పైన పెద్ద పెద్ద ప్రింట్స్ లేదా పాకెట్స్ ఉన్నవి అవాయిడ్ చేయాలి.

4. ట్రెపిజాయిడ్ బాడీ టైప్ (Trapezoid Body Type): దీనిని బాడీ టైప్స్‌లో “OG” (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) అని పిలవచ్చు, ఎందుకంటే వీరికి దాదాపు అన్ని రకాల అవుట్‌ఫిట్స్ సెట్ అవుతాయి. భుజాలు మరియు నడుము సరైన నిష్పత్తిలో ఉండటమే దీని ప్రత్యేకత.

  • సెలబ్రిటీ ఉదాహరణలు: రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ ఈ బాడీ టైప్‌కు చెందినవారు.
  • డ్రెస్సింగ్ టిప్స్: వీరు పోలో షర్ట్స్, హెన్లీస్, టైలర్డ్ ఫిట్, స్లిమ్ ఫిట్ – ఇలా ఏవైనా ధరించవచ్చు. మరీ ఎక్కువ షోల్డర్ ప్యాడింగ్ అవసరం లేదు.
  • స్టైల్ ఫిలాసఫీ: వీరికి “లెస్ ఈజ్ మోర్” (Less is more) అనే సూత్రం బాగా వర్తిస్తుంది. మరీ హెవీగా కాకుండా మినిమల్ గా, ఎఫర్ట్‌లెస్ గా కనిపిస్తేనే వీరు క్లాసీగా ఉంటారు. పైన లైట్ కలర్స్, కింద డార్క్ కలర్స్ వేసుకోవడం మంచి కాంబినేషన్.

5. ఓవల్ బాడీ టైప్ (Oval Body Type) : శరీరం మధ్య భాగంలో (పొట్ట వద్ద) వెడల్పు ఎక్కువగా ఉంటే అది ఓవల్ బాడీ టైప్.

  • డ్రెస్సింగ్ టిప్స్: వీరు సన్నగా కనిపించడానికి ఇల్యూషన్ క్రియేట్ చేయాలి. దీని కోసం డార్క్ కలర్ దుస్తులు ధరించడం ఉత్తమం.
  • పాటర్న్స్: హారిజాంటల్ లైన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం వర్టికల్ (నిలువు) లైన్స్ ఉన్న షర్ట్స్ మాత్రమే వాడాలి. ఇది శరీరాన్ని పొడవుగా మరియు సన్నగా చూపిస్తుంది.

మీరు ఏ బాడీ టైప్ అయినా సరే, గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే – ప్రస్తుతం మీ బాడీ ఎలా ఉందో దానికి తగ్గట్టు బట్టలు కొనండి. రెండు నెలల తర్వాత సన్నబడతాను లేదా లావు అవుతాను అని అప్పుడు సరిపోయే బట్టలు ఇప్పుడే కొనకండి. ట్రెండ్‌తో సంబంధం లేకుండా మీ శరీరానికి ఏది నప్పుతుందో అది వేసుకున్నప్పుడే మీరు ఆత్మవిశ్వాసంతో, స్టైలిష్‌గా కనిపిస్తారు.

See Also plz click on this: How to dress according to your body type

ఇలాంటి మరిన్ని వాటి కొరకు తెలుగు రీడర్స్ ఫ్యాషన్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.