Home » హాయ్ రే హాయ్ – ఒక్కడు

హాయ్ రే హాయ్ – ఒక్కడు

by Firdous SK
1.2K views
hai re hai song lyrics okkadu

నువ్వేమాయ చేసావో గాని
ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని
నువ్వేమాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోని

నువ్వేమాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోని
హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండని
రేయి చాటు రాగం విని

ఎవరు తనని పిలిచారని
అడిగి చూడు నీ మనసుని
హేయ్ కాలాన్నే కదలనీయని
కనికట్టే జరగలేదని

ఈ తీయని మాయ తనదని తెలుసానీ
మనసు నీదే మహిమ నీదే
పిలుపు నీదే బదులు నీదే
నువ్వేమాయ చేసావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేమాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోని

మూగ మనసిది ఎంత గడుసిది
నంగనాసి సంగతులెన్నో వాగుతున్నది
ఓహో ఇంత కాలము కంటి పాపలో
కొలువున్న కల నువ్వే అంటున్నది

హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండని
రేయి చాటు రాగం విని
ఎందుకు ఉలికి పడుతుందని
అదిగి చూడు నీ మనసుని

హేయ్ నిదురించే నీలి కళ్లలో
కల ఎప్పుడు మేలుకున్నదో
ఆ కల ఎం వెతుకుతున్నదో తెలుసానీ
కనులు నీవే కలలు నీవే
పిలుపు నీదే బదులు నీదే

నువ్వేమాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేమాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోని

పిచ్చి మనసిది ఆ ఏంత పిరికిది
నచ్చుతానో లేదో నీతో అడగమన్నది
ఓహో ఆశ ఆగక అడుగు సాగక
అలలాగా ఎగిరి ఎగిరి పడుతోన్నది

హాయ్ రే హాయ్ రే హాయ్ ఎండని
రేయి చాటు రాగం విని
గాలి పరుగు ఎటువైపని
అదిగి చూడు నీ మనసుని

హేయ్ ఏ దారినా సాగుతున్నదో
ఎమాజిలీ చేరుకున్నదో
ఏ తీరం కోరుతున్నదో తెలుసా అని
పదము నీదే పరుగు నీదే

పిలుపు నీదే బదులు నీదే
నువ్వేమాయ చేసావో గాని
ఇలా ఈ క్షణం ఆగిపోని
నువ్వేమాయ చేసావో గాని….

మరిన్ని పాటల కోసం తెలుగు రీడర్స్ ను సందర్శించండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.