Home » పుట్టేనే ప్రేమ – గల్లీ రౌడీ

పుట్టేనే ప్రేమ – గల్లీ రౌడీ

by Firdous SK
0 comment

చిత్రం: గల్లీ రౌడీ
పాట: పుట్టేనే ప్రేమ
సంగీతం: రామ్ మిరియాల
సాహిత్యం: భాస్కరభట్ల
గాయకుడు: రామ్ మిరియాల


పుట్టేనే ప్రేమ పడగొట్టేనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో కోమ
అతలాకుతలం అవుతున్నాన్నమ్మ

నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంటా
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంటా
సెల్ నంబర్ని చెప్పు రింగ్ ఇచ్చేసుకుంటా
మంచి డేట్ ఉంటె చెప్పు పెళ్లి చేసుకుంటా
పుట్టెనే.. పుట్టేనే..

పుట్టేనే ప్రేమ పడగొట్టేనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో కోమ
అతలాకుతలం అవుతున్నాన్నమ్మ

కత్తులతో ఎప్పుడు కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగా మెరిసావే ఓ…
మగపురుగులతో చిరాకుగా ఉండే జీవితంలో
ఆడ వాసనిపుడే చూపావే

నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చుకుంటా
నీ టేస్ట్ ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటాను
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా
నాన్నకు అప్పుంటే చెప్పు
నేను తీర్చేసుకుంటా

పుట్టెనే..పుట్టేనే..
పుట్టేనే ప్రేమ పడగొట్టేనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా

దోమ తెరలాగా ఊసురనీవుండే నా లైఫు
వెండి తెర చేసావే ఓ…
ఒక్క నవ్వుతోనే కుండీలాంటి
బుజ్జిగుండెలోన ప్రేమ విత్తనాలే జల్లేసావే

నీ ఇష్టాలు చెప్పు లిస్టు రాసేసుకుంటా
నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా
ఎం కావాలో చెప్పు గిఫ్ట్ ఇచ్చేసుకుంటా
నువ్వు కాదంటే చెప్పు
నేను ఊరేసుకుంటా

పుట్టెనే.. పుట్టేనే..
పుట్టేనే ప్రేమ పడగొట్టేనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో కోమ
అతలాకుతలం అవుతున్నాన్నమ్మ

మరిన్ని పాటల కోసంతెలుగు రీడర్స్ను సందర్శించండి.

You may also like

Leave a Comment