కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
పూటకి ఓ పండగల ప్రతి రోజు తోచే
అనునిత్యం ఆనందం ఎదలో పూచే
నలుదిక్కుల నలుగురము ఎగిరిపోతున్నా
ఒక గూటికి మరలా చేరే ప్రేమే మిన్నా
ఆహా ఇది చాలు…
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
పూటకి ఓ పండగల ప్రతి రోజు తోచే
అనునిత్యం ఆనందం ఎదలో పూచే
ఆశకి హద్దులు లొంగున
గాలిని కంచెలు ఆపునా
కన్నులు మోయని ఏ కల్లుండునా
క్షణముకి ఓక కోరిక అచ్చంగా నమ్మేది దీన్నిక
మనస్సు మాటనే విను ఇక
అక్కడే ఆగక అడుగేస్తాముగా
కలనే కలిసే ఇలలో…
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
పూటకి ఓ పండగల ప్రతి రోజు తోచే
అనునిత్యం ఆనందం ఎదలో పూచే
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
కలలన్నీ నిజమయ్యే తరుణాలే వచ్చే
కష్టాలే దాటే సుఖములనే తెచ్చే
________________
పాట: కలలన్నీ (Kalalanni)
చిత్రం: 3BHK (Telugu)
సంగీతం: అమృత్ రామ్‌నాథ్ (Amrit Ramnath)
సాహిత్యం: రాకేందు మౌళి (Rakendu Mouli )
గాయకులు: హేమచంద్ర వేదాల (Hemachandra Vedala), గోపికా పూర్ణిమ (Gopika Poornima), సాహితీ చాగంటి (Sahithi Chaganti), పివిఎన్ఎస్ రోహిత్ (PVNS Rohit)
రచయిత-దర్శకుడు: శ్రీ గణేష్ (Sri Ganesh)
నటీనటులు: సిద్ధార్థ్ (Siddharth), శరత్ కుమార్ (Sarath Kumar), దేవయాని (Devayani), యోగి బాబు (Yogi Babu), మీటా రఘునాథ్ (Meetha Raghunath), చైత్ర (Chaithra)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.