బాపుకే అందని బొమ్మ…
ఈ రోజే మురిసే నా జన్మ..
ఎవరైనా ఎదిరిస్తానమ్మా..
నా ప్రాణం నీదేనోయమ్మా..
సిరులైన సరిపోతాయా నీ చిరునవ్వులకు
కల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే
నాలోనే దాగుందమ్మా ఆ రూపం నీదే
ఏ భాధ రానినమ్మో నీ ఆ కన్నులకే
రాణి నువ్వే దొరసాని నువ్వే
మౌనం పలికే ఆ వాని నీదేనా
పంతం నువ్వే నా సొంతం నువ్వే
నేనే నీకై ఏదైనా చేసైనా
సిరులైన సరిపోతాయా నీ చిరునవ్వులకు
కల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే
చిరుజల్లులా నీ చిరునవ్వులే వాకిట్లో ముత్యాలై కురిసే
దిగమోయని ఇంతానందం దేనికో
నీ ప్రేమకు నేనంటూ నీ కొరకో..
మేఘాల్లో ప్రేమంతా పరిచి
వెన్నెలకై నిదురంతా మరిచి
రేయంతా రెప్పలు వెయ్యక చూసేనో
నీకోసము ఇన్నాళ్లుగా ఏమో..
నువ్వు నవ్వితే బాగుంటుంది నీలో ఏదో మాయే ఉంది
ఈ వింతనే బహుబాగుంది నీ వెంటనే నడిపిస్తుంది
అందం నువ్వే ఆనందం నువ్వే
నా గుండెలో నూరేళ్లు దాచైనా
గారం నువ్వే నా తీరం నువ్వే
నన్నే లాగే ఆధారం నువ్వేనా
సిరులైన సరిపోతాయా నీ చిరునవ్వులకు
కల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే
నాలోనే దాగుందమ్మా ఆ రూపం నీదే
ఏ భాధ రానినమ్మో నీ ఆ కన్నులకే
ఇటు చూడమ్మా బంగారమా
రాసిస్తానే నా ఈ జన్మ
కనుమూసినా కనుతెరిచినా
నీ రూపమే నా ముందర
తోడై నువ్వే నాతోనే ఉంటే
యుద్ధం అయినా సిద్ధంగా నేనుంటా
నువ్వే నేనై నీలోనే సగమై నీతో నడిచే
ఆ వరమే ఇచ్చాయ్ వా
సిరులైన సరిపోతాయా నీ చిరునవ్వులకు
కల నిజమై నిన్ను గెలిచేటి అదృష్టం నాదే
చిరుజల్లులా నీ చిరునవ్వులే వాకిట్లో ముత్యాలై కురిసే
దిగమోయని ఇంతానందం దేనికో
నీ ప్రేమకు నేనంటూ నీ కొరకో..
_________
పాట పేరు – సిరులైన సరిపోతాయా (Sirulaina Saripothaya)
సంగీతం & ప్రోగ్రామింగ్ – ఇంద్రజిత్ (Indrajitt)
సాహిత్యం – శ్రవణ్లైఫ్ఫెయిల్యూర్ (Sravan_Life_Failure)
గాయకులు – రాము రాథోడ్ (Ramu Rathod), శ్రీనిధి (Srinidhi)
కోరస్ – జయశ్రీ (jayasree) & బృందం
దర్శకత్వం – దిలీప్ దేవగన్ (Dilip Devgan)
నటీనటులు – రాము రాథోడ్ (Ramu Rathod), మంకృతి (Mankrithi), చోటా పటాకా (Chota Pataka)
కొరియోగ్రఫీ – మను మైఖేల్ (Manu Michael)
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.