సుక్కపొద్దు సక్కనిదాన్ని ఎందరినో సూసినదాన్ని
సుక్కపొద్దు సక్కనిదాన్ని ఎండకన్ను తగనిదాన్ని
ముట్టుకుంటే మాసిపోయే అందాన్ని
ఎందరినో సూసినదాన్ని ఎవలిని మెచ్చనిదాన్ని
నిన్ను చూసి నచ్చినారయ్యో నీదాన్ని
ఏమి మాయ చేసినవో పడ్డ నీకే పిల్లోడా
చేసుకోరా అరెరే చేసుకోరా
హేయ్ చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
అరె చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
కాగుతున్న వెంట నీదాన్ని మట్టి వాన తెలియనిదాన్ని
అమ్మా అయ్యా ముద్దుల చిన్న కూతురుని
అందగాళ్ళు ఎందరు ఉన్నా ఆస్తి పాస్తి మాస్తుగా ఉన్నా
నిన్ను చూసి మెచ్చినరయ్యో నీదాన్ని
కాలికి మెట్టెగా నువ్వే తోడుగా ఉండు పిల్లోడా…
చేసుకోరా అరెరే చేసుకోరా
హేయ్ చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
అరె చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
అరె పట్టుచీర కట్టిన నేను
బుగ్గ చుక్క పెట్టిన నేను
నెత్తికి బాసికము నువ్వే కట్టలే
పూల వన్నె పందిరి కింద పీఠమెక్కి కూసున్న నేను
జిల్లకర్ర బెల్లము నువ్వే పెట్టాలె
లగ్గముల చాటుగా నువ్వు నాకే సైగలు చేయాలే
చేసుకోరా అరెరే చేసుకోరా
హేయ్ చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
అరె చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
అరె వట్టునాటు బొమ్మను నేను ఏడుకొండ స్వామివి నువ్వై
మెడల పూస్తేలు నువ్వే కట్టలే
మెల్లగా చెయ్యినిపట్టి సిగ్గులన్ని పక్కన పెట్టి
తీన్మారు చిందులు నీతో ఎయ్యాలే
వచ్చిన చుట్టాలంతా జంటను చూసి మెచ్చలే
చేసుకోరా అరెరే చేసుకోరా
హేయ్ చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
అరె చేసుకోరా లగ్గం నువ్వే పెనీమిటి గావాలె
నా సామిరంగా ఇద్దరి జంట అదిరిపోవాలే
________________________
నటి : ఝను భూపతి (Jhanu Bhupathi)
కొరియోగ్రఫీ: శిశాంత్ (Shishaanth)
కాన్సెప్ట్ & డైరెక్షన్: కిర్రాక్ నాని (Kirrak Nani)
సాహిత్యం: రాజు తాడూరి (Raju Thaduri)
గాయని: వాగ్దేవి (Vagdevi)
సంగీతం: హనీ గణేష్ (Honey Ganesh)
Dj: Dj విష్ణు (Vishnu)
నిర్మాత: ప్రేమ్ పర్ఫెక్ట్ (Prem Perfect)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.