కొబ్బరి తోటల్లా కలుసుకుంటావా
కమ్మలిస్తానే సిలుకు సునీత
మందార తోటల్లా మందలిస్తావా
మువ్వలిస్తానే సిలుకు సునీత
నీ చిన్ని చెవ్వులకు బుట్టల కమ్మలు పెట్టుకో
తోటళ్ళు కుల్లుకోవాలే
మెత్తని కాళ్ళకు మువ్వల పట్టీలు పెట్టుకో
ఊరంతా ఘల్లుమనాలే
కొబ్బరి తోటల్లా కలుసుకుంటావా
కమ్మలిస్తానే సిలుకు సునీత
మందార తోటల్లా మందలిస్తావా
మువ్వలిస్తానే సిలుకు సునీత
కొబ్బరి తోటల్లా కలుసుకోనొస్తే
మందార తోటల్లా మందలియోస్తే
కొబ్బరి తోటల్లా కలుసుకోనొస్తే
మందార తోటల్లా మందలియోస్తే
కమ్మలిచ్చి కౌగిలియ్యమంటావు
మువ్వలిచ్చి ముద్దులియ్యమంటావు
కొబ్బరి తోటకు నేను రానయ్యో
అసువంటి దానిని నేను కాదయ్యో
మందార తోటకు నేను రానయ్యో
మావోళ్ళు నన్నాట్ట పెంచలేదయ్యో
గుట్టకు కట్టెలు కొట్టవాస్తావా
గుండ్లు చేపిస్తా సిలుకు సునీత
కట్టకు కడవతో నీళ్లకొస్తావా
కాటుక ఇస్తా సిలుకు సునీత
నున్నని నీ మేడలో పూలతో కమ్మేత్తే
చందమామ అయినా అయితది హైపత్తే
తలువాల కళ్ళకు కాటుక దిద్దితే
కరుమొబ్బులైన కరుగును ఈ పొద్దే
గుట్టకు కట్టెలు కొట్టవాస్తావా
గుండ్లు చేపిస్తా సిలుకు సునీత
కట్టకు కడవతో నీళ్లకొస్తావా
కాటుక ఇస్తా సిలుకు సునీత
గుట్టకు కట్టెలు కొట్టనికోస్తే
కట్టకు కడవతో నీళ్లకు వొస్తే
గుట్టకు కట్టెలు కొట్టనికోస్తే
కట్టకు కడవతో నీళ్లకు వొస్తే
గుండు ఇచ్చి గుండె మీదే చేయ్యేస్తావు
కాటుక పెట్టి కొరికేస్తానంటావు
గుట్టకు నియంట నేను రానయ్యో
అసువంటి దానిని నేను కాదయ్యో
నీళ్ళకొచ్చి కాలు నే జరనయ్యో
మావోళ్ళు నన్నాట్ట పెంచలేదయ్యో
జముల మావిళ్ల నీడకోస్తావా
నిర తెస్తానే సిలుకు సునీత
పగటిలి పజ్జోన్న కాపుకొస్తావా
కళ్ళు తెపిస్తా సిలుకు సునీత
మామిడి నీడల్లో నిరతాగి నువ్వు నిద్రపొదువే
ఉయ్యాల ఊగుతూ
పజొన్న చేలల్లో కళ్ళు తాగి నువ్వు కేకలేద్దువే
మంచంపై ఎగురుతూ
జముల మావిళ్ల నీడకోస్తావా
నిర తెస్తానే సిలుకు సునీత
పగటిలి పజ్జోన్న కాపుకొస్తావా
కళ్ళు తెపిస్తా సిలుకు సునీత
జముల మావిళ్ల నీడకు వొస్తే
పగటిలి పజొన్న కాపాలకొస్తే
జముల మావిళ్ల నీడకు వొస్తే
పగటిలి పజొన్న కాపాలకొస్తే
నిరతాగి పిచ్చి నాకారాలు చేస్తావు
కళ్ళు తాగి పిచ్చి కొంగు లాగేస్తావు
మావిళ్ల నీడకు నేను రానయ్యో
అసువంటి దానిని నేను కాదయ్యో
పజొన్న మంచెపై మోసపోనయ్యో
మావోళ్ళు నన్నాట్ట పెంచలేదయ్యో
సాంగ్ క్రెడిట్స్ :
సాహిత్యం : సాయి ప్రసాద్ పూజారి (Sai Prasad Poojari)
గాయకులు: హన్మంత్ యాదవ్ (Hanmanth Yadav) & మమత రమేష్ (Mamatha Ramesh)
సంగీతం : కృష్ణుడు (Krishnudu)
నటులు: బ్రమరాంభిక (Bramarambhika) & ఈశ్వర్ సాయి (Eshwar Sai)
కొరియోగ్రాఫర్: లీడింగ్ బాయ్స్ (శ్రీకాంత్) (Leading Boys (Srikanth))
మరిన్ని ఇటువంటి వాటి కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.