Home » కంగారే పడకురా (Kangaree Padaku Ra) సాంగ్ లిరిక్స్ – బాపు (Baapu)

కంగారే పడకురా (Kangaree Padaku Ra) సాంగ్ లిరిక్స్ – బాపు (Baapu)

by Lakshmi Guradasi
0 comments
Kangaree Padaku Ra song lyrics Baapu

Kangaree Padaku Ra song lyrics Baapu

కంగారే పడకురా అందరి కథ ఇంతేరా
కష్టాలే ఎరుగని కథ అంటూ ఉండదురా
కన్నీళ్లే దాటని కళ్లేవి లేవు కదా..
కల్లోలం జరగని బ్రతుకంటూ ఉండదుగా

ఆ దైవం ఎపుడూ ఆడే ఆటే ఇదిరా
ఏ పుస్తకమూ నేర్పించని పాఠం ఇదిరా
నీతో నువు యుద్ధం చేస్తూ సాగాలిరా

నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువే మరి బాధ పడకు
ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా
నీ చిక్కులన్నివి తీరవంటూ
ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు
ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా

పడుతూ పడుతూ ఉన్నా పొరపడుతు పడుతూ ఉన్నా
తడబడకు విడకు ఎపుడూ.. పరీక్షలు ఎదురైనా
నెడుతూ నెడుతూ ఉన్నా
విధి వలలే విసురుతు ఉన్నా
ఎదురెలుతూ తెంచుకు వెళ్ళు
సంకెళ్లే ఎన్నున్నా..

చూడు చూడు చూడు చరితలు చూడు తెలుపును సత్యాలు
ఒడిదుడుకుల అడుగులు పడక గెలిచిన వాడెవడు
కష్టమొచ్చినా వదలకు పట్టు ఎక్కాలోయ్ గట్టు
శిశిరంలో ఆకులు రాలినా చిగిరించును చెట్టు..

నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువే మరి బాధ పడకు
ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా
నీ చిక్కులన్నివి తీరవంటూ
ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు
ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా

కనిపెట్టి ఆకలి ముప్పు వలసెళ్ళును గువ్వల గుంపు
తప్పదు అనుకుంటే నీ చోటు మారితే ఏం తప్పు
వడ గాలులు తరుముతూ ఉంటే ఎగిరిలెల్లునులే ఆ మబ్బు
తడి గాలులు తాకిన వేళ కురిపించునులే చినుకు
తిప్పలెన్ని ఉన్నా తప్పు చేయకుంటే అదిరా నీ గెలుపు
ఒప్పుకుంటూ వెళ్ళు ఎదురీతలని చూపిస్తూ ఓర్పు
తప్పకుండా మరి కనిపించునురా నువ్వు కోరే మలుపు
నొప్పిలేని జన్మే ఉండదురా కనరా కనువిప్పు…

నీకే ఇలా జరిగింది అంటూ నీలో నువే మరి బాధ పడకు
ఏ చెట్టుకంతటి గాలి ఉండును చూడరా
నీ చిక్కులన్నివి తీరవంటూ
ఎక్కిళ్ళు పెడుతూ ఆగిపోకు
ధైర్యంగా వెతుకు దారి దొరుకును సోదరా

Song Credits:

పాట: కంగారే పడకురా (Kangaree Padaku Ra)
గాయకుడు: అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni)
సంగీతం: RR ధ్రువన్ (RR Dhruvan)
సాహిత్యం: అలా రాజు (Ala Raju)
నిర్మాత – రాజు (Raju), చ. భాను ప్రసాద్ రెడ్డి (ch. Bhanu prasad reddy)
రచన మరియు దర్శకత్వం: దయా (Daya)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.