ఓ యువరాణివే చిన్ని దొరసానివే
ఆని లోకం నీ నవ్వేనే..
ఓ యువరాణివే నవ్వుల అలివేణివే
వాని ప్రాణం అది నువ్వేనే..
ఓ యువరాణిలా నిన్నే పెంచారుగా
నువ్వే పెద్దింటి దొరసానివే..
ఆ దొరసానిలా చూస్తూ పెరిగాడుగా
వాడే నీ ఇంటి పనివాడేనే
సిత్తం మహారాణి అంటూ
నే చేతులు కట్టి నీ ముందు
నీ కాలికి చెప్పోలే ఉంటూ
ఈ జన్మంతా బతికేస్తే చాలు
పేదింటి పుట్టుక నాదేనే
పెద్దింటి బంగుల నీదేనే
వందేళ్ళు నీతో నడిసేటి
అదృష్టం లేనే లేనోన్నే..
ఓ యువరాణివే చిన్ని దొరసానివే
నా లోకం నీ నవ్వేనే..
ఓ యువరాణివే నవ్వుల అలివేణివే
నా ప్రాణం అది నువ్వేనే..
కలలోనైనా నిన్ను నా కలలోనైనా
బాధపెట్టేటోడ్నే కాదే అట్టాంటిది
ఇలలో నిన్నే బాధపెట్టి ఎట్టా బతికుంటా చెప్పే
మట్టిలో మాసిన బట్టలతో పొద్దు మాపు బతికే కూలోన్ని
సద్దిలో ఎర్రటి కారముతో రోజులెల్లదీసే పేదోన్ని
నీకు కష్టమే వద్దని నీ ప్రేమ వద్దు అంటున్నా
నా ప్రేమ దాసిపెడుతూనే కంట కన్నీళ్లే పెడుతున్న
ఈ మట్టి మీద నేను ఒట్టేసి చెబుతున్న నువ్వంటే ప్రేమున్నదే
ఆ ప్రేమ నీతోనే చెప్పలేకనే లోలోన చస్తున్నానే
పేదింటి పుట్టుక నాదేనే
పెద్దింటి బంగుల నీదేనే
వందేళ్ళు నీతో నడిసేటి
అదృష్టం లేనే లేనోన్నే..
ఓ యువరాణివే చిన్ని దొరసానివే
ఆని లోకం నీ నవ్వేనే..
ఓ యువరాణివే నవ్వుల అలివేణివే
వాని ప్రాణం అది నువ్వేనే..
దూరంగానైనా నిన్ను నేను దూరంగానైనా
తల ఎత్తి చూస్తే ఎంత తప్పు అట్టాంటిది
అమ్మాయి గారు మీ యేలు బట్టితే ఇంకెంత తప్పు
కష్టమే తెలియని ఎన్నెలవే కన్నీళ్ళు చూడని కనుపాపవే
నవ్వుతూ నిండు నూరేళ్ళు ఉంటే చాలే కష్టము రాకుండనే
నా చేతిలోని గీతను నీ రాతతోని కలుపకు
నీ మనసులోన చోటిచ్చి అదృష్టవంతుణ్ని నన్ను చెయ్యకు
నీ చెయ్యి బట్టి నాతో నడిపించి కన్నీటి కానుక ఎట్లీయను
నా కోసమే నువ్వు కన్నీళ్లు పెడుతుంటే ప్రేమకు బానిసను
Song Credits:
నిర్మాత: అనిల్ బండారి
సాహిత్యం & దర్శకత్వం: రాకేష్ చందా
సహాయ దర్శకుడు: హరి దేవరకొండ
నటీనటులు : మీనాక్షి, నరేష్, రాజ్‌కుమార్ జె.జె
గానం: హనుమంతు యాదవ్ & బేబీ టీమ్
సంగీతం: ఇంద్రజిత్
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.