Home » గణ గణ మోగాలిరా (Ganagana Mogalira)  సాంగ్ లిరిక్స్ | మంగళవారం

గణ గణ మోగాలిరా (Ganagana Mogalira)  సాంగ్ లిరిక్స్ | మంగళవారం

by Lakshmi Guradasi
0 comments
Ganagana Mogalira song lyrics Mangalavaaram

Ganagana Mogalira song lyrics:

అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా
హారతందుకో మమ్ము అదుకోయే
పూజలందుకో పుణ్యమించుకోయే

గణ గణ మోగాలిరా గుళ్లో ఉన్న గంటా
గజ్జ కట్టి ఆడాలిరా చిన్నా పెద్ద అంతా
అమ్మవారి ఊరేగింపు అచ్చం కన్నుల పంటా
రంగ రంగ వైభవంగా జల్లాలంతా

అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా

అమ్మ డంగురు డంగురు డంగురుమా
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా

రంగులన్ని కలిసినట్టే ఉంటాయిరా
ఎప్పుడూ అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా
ఎవడి రంగు ఏమిటంటే ఎవడు చెప్పగలడు

అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా

హే పచ్చ పచ్చని ఊరు మీద
పడినది పాడు కన్ను
ఆరని చిక్కె పెట్టి పోతాదే
ఆపేవాడు లేనే లేదు అంత బుడిదే
తెల్ల తెల్లటి గోడ మీద
ఎర్రటి అక్షరాలు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయే
రాసే వాడు వీడో వాడో ఏమో తెలిదే

మరణం తప్పదిక ప్రతి మంగళారం
చేమటలు పట్టిస్తది ఒక్కో చావు మేళం
వేట మొదలయ్యిందిరా ఇవ్వాల్సిందే ప్రాణం
తప్పుకొని పోదామన్నా పోలేవెంతో దూరం

ఆ ఆ అమ్మ మాలచ్చి మాలచ్చి మాలచ్చి అమ్మ
మాకు పెద్దమ్మ చిన్నమ్మ నువ్వేనమ్మ
అమ్మ దండాలు దండాలు దండాలమ్మ
నానా గండాలు దాటించి కాపాడమ్మా

ఎంతకాలం ఏస్తావురా మంచోడనే ముసుగు
అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మ తల్లి చూస్తాదిరా నీలో ఉండే లోసుగు
అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా
అమ్మోరు డంగురు డంగురుమా

ఆఆ.. ఆ.. అమ్మ డంగురు డంగురు డంగురుమా
ఆఆ.. ఆ.. అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా
ఆఆ.. ఆ.. అమ్మ డంగురు డంగురు డంగురుమా
ఆఆ.. ఆ.. అమ్మ అమ్మోరు డంగురు డంగురుమా

Song Credits:

పాట : గణ గణ మోగాలిరా (Ganagana Mogalira)
ఆల్బమ్ : మంగళవారం (Mangalavaaram)
సంగీత దర్శకుడు : బి. అజనీష్ లోక్‌నాథ్ (B. Ajaneesh Loknath)
గీత రచయిత : భాస్కరభట్ల (Bhaskarabhatla)
గాయకులు: వి.ఎం. మహాలింగం (V.M. Mahalingam)

పాట భావం:

గణ గణ మోగాలిరా పాట అమ్మవారి మహిమను, కరుణను, భక్తులపై ఆమె అనుగ్రహాన్ని వివరించే ఓ భక్తి గీతం. అమ్మవారిని ప్రేమతో పిలుస్తూ, ఆమె రక్షణ కోసం ప్రార్థిస్తూ, భక్తులు తమ భయాలను, ఆశలు వ్యక్తపరచుకుంటారు. కష్టాలు ఎంతటి వారినైనా తరిమేయగల శక్తి అమ్మవారిదే, ఆమె కరుణకు, శక్తికి ఎవరూ సరిసమానులు కారని ఈ పాట తెలియజేస్తుంది. భక్తుల జీవితాల్లో ఆమె అనుగ్రహం వెలుగులు నింపాలని ఈ పాట ప్రార్థనగా మారుతుంది.

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.