తాలింక ఎందుకులేవే నువ్వే నా ప్రియసతివే
తాంబూలం దండగలేవే నాలో నువ్వు సగమేలే
చిరు పెదవులు పలికెను పలికెను
ఎదలొకటై కలిసెను కలిసెను
మావ కూతురు నువ్వే నువ్వేలే…….
చెలి చిలకా…. నీలో నన్ను వెతుకుతున్నా
తల్లు తలుకా….. నీశ్వాసయై బతుకుతున్నా
కన్నె కులుకా…..నీ నీడల్లే మసలుతున్నా
కసిమొలకా……..
తాలింకా ఎందుకులేర నేనే నీ ప్రియసతినే
తాంబూలం దండగలేరా నాలో నువ్వు సగమేలే
పడుచుకొంగు పదునెంతో
అనువు అనువు గాలిస్తూ
తాలి కట్టి లాలించేన మైన మైనా….
సిగ్గుతాలలోలకిస్తూ నడుమొంపుల ఊర్వశిలా
చెయ్యేపట్టి వోయ్యారాలే వొలకించేనా……
అలివేని అలివేని….మనసున మనసైపోదాం
కలలన్నీ కలలన్నీ చెదరక చెరిసగమౌదాం
నువ్వు కాదంటున్న నీకై చూస్తున్నా….
అత్తకొడుకా…..నిను గుండెల్లో నిలుపుకున్న
అనుకొనగా….నా ప్రాణంలో కలుపుకున్నా
నిన్ను జతగా….. హో… హో… హో….
తాలింక ఎందుకులేవే నువ్వే నా ప్రియసతివే
తాంబూలం దండగలేవే నాలో నువ్వు సగమేలే
ఎంతమందిలోవున్నా ఎవ్వరూ ఏమనుకున్నా
కౌగిల్లే పంచి కొరకిస్తలే నిన్నే.. నిన్నే..
హే.. కుర్రతనం గుర్రమెక్కి ముప్పు తిప్పలెన్నో పెట్టీ
నిన్నే నాలో బందిచేస్తా మైనా.. మైనా..
అడిగెయన అడిగెయన తలపున మునగిన నిన్నే
నువ్వేనా నువ్వేనా నా గుండెను నమిలిన కన్నే
నను నాలో కాదు నీలో చూస్తున్నా……
చెలి చిలుకా… నా చిరునామా నీ వలపే
తడి తలుకా….నా మనసంతా నీ తలపే
కన్నే మొలకా…. వో.. హో… హో….
తాలింక ఎందుకులేవే నువ్వే నా ప్రియసతివే
తాంబూలం దండగలేవే నాలో నువ్వు సగమేలే
Song Credits:
సాంగ్ : తాలింక ఎందుకులేవే (Talinka enduku leve)
సినిమా: భరణి (Bharani)
గానం: రఘు కుంచె (Raghu Kunche), భవతారిణి (Bhavatharini)
సంగీతం: యువన్ శంకర్ రాజా (Yuvan Shankar Raja)
గీత రచయిత: సాహితీ (Sahithi), వనమాలి (Vanamali)
నటీనటులు: విశాల్ (Vishal), ముక్త (Muktha)
“తాలింక ఎందుకులేవే” పాట విశ్లేషణ:
“భరణి” సినిమాలోని “తాలింక ఎందుకులేవే” పాట ఒక హృదయస్పర్శమైన మెలోడీ. యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వంలో, రఘు కుంచె మరియు భవతారిణి స్వరపరిచిన ఈ పాట ప్రేమికుల హృదయాలను హత్తుకునే విధంగా ఉంటుంది. పాటలోని మెలోడీయస్ ట్యూన్, సాఫ్ట్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మరియు యథార్థమైన భావోద్వేగాల కలయిక పాటను ప్రత్యేకంగా నిలిపింది. సాహితీ, వనమాలి కలసి రాసిన ఈ గీతం హృదయాన్ని తాకే పదాలతో ఉంటుంది.
విశాల్, ముక్త జంటపై చిత్రీకరించిన ఈ పాట విజువల్‌గా కూడా రొమాంటిక్ మూడ్‌ను పెంచేలా ఉంటుంది. యువన్ శంకర్ రాజా ప్రత్యేకమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మృదువైన సంగీత ప్రయోగాలు పాటలో కొత్తతనాన్ని తీసుకువచ్చాయి. ఇది ప్రేమను వ్యక్తపరిచే ఓ హాస్యభరితమైన, భావోద్వేగపూరితమైన పాటగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.