ఏల్లయ్య బావ ఏసో ఈ జానపద డీజే పాటను ఆదిమల్ల గిరమ్మ ఆలపించగా, సంధ్యా ధన కోరస్ అందించారు. రాజు మల్ సంగీతం సమకూర్చగా, సింహాద్రి దుర్గం నిర్మాణం, దర్శకత్వం వహించారు. పాటలో జాను లిరి నటించగా, రాజేష్ పైండ్ల కొరియోగ్రఫీ అందించారు. డీజే మిక్సింగ్ ను మహేష్ చింతల్‌పురి నిర్వహించారు.
Ellayya Bava Eso Folk song lyrics
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
బిందె మీద బిందె పెట్టి ఏసో ఓహో
బీన పెళ్లికి నేను వోతే బావయ్య
బీన పెళ్లికి నేను వోతే బావయ్య
బీనపెల్లి బిందెలోడు ఏసో ఓహో
బిందె మీద కన్నులేసే బావయ్య
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
బొట్టు మీద బొట్టు పెట్టి ఏసో ఓహో
బోనగిరికి నేనే పోతే బావయ్య
బోనగిరికి నేనే పోతే బావయ్య
బోనగిరి భోగమోడు ఏసో ఓహో
బొట్టు మీద కన్నులేసే బావయ్య
బొట్టు మీద కన్నులేసే బావయ్య
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
కళ్ళకేమో కాటుకెట్టి ఏసో ఓహో
కాకినాడ నేనే పోతే బావయ్య
కాకినాడ నేనే పోతే బావయ్య
కాకినాడ కమ్మరోడు ఏసో ఓహో
కన్ను కొట్టి సైగ చేసే బావయ్య
కన్ను కొట్టి సైగ చేసే బావయ్య
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
చీర తీసి చీర కడితే ఏసో ఓహో
సిరిపురం నేనే పోతే బావయ్య
సిరిపురం నేనే పోతే బావయ్య
సిరిపురం సిక్కులోడు ఏసో ఓహో
చీర మీద కన్నులేసే బావయ్య
చీర మీద కన్నులేసే బావయ్య
ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లు
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే గొడుగు తెర బావయ్య
ఎండ కొట్టే గొడుగు తెర బావయ్య
బుట్ట మీద బుట్ట పెట్టి ఏసో ఓహో
బుట్టలమ్మ నేనే పోతే బావయ్య
బుట్టలమ్మ నేనే పోతే బావయ్య
గుట్ట కింది గొర్రెలోడు ఏసో ఓహో
బుట్ట మీద కన్నులేసే బావయ్య
బుట్ట మీద కన్నులేసే బావయ్య
రైక మీద రైకలేసి ఏసో ఓహో
రంగాపురం నేనే పోతే బావయ్య
రంగాపురం నేనే పోతే బావయ్య
రంగాపురం రాజుగాడు ఏసో ఓహో
రైక మీదే కన్నులేసే బావయ్య
రైక మీదే కన్నులేసే బావయ్య
ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లు
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఏడడుగులు నాతో నడువు బావయ్య
ఏడడుగులు నాతో నడువు బావయ్య
నిమ్మలంగా నీతో ఉంటే ఏసో ఓహో
మూడు ముళ్ళు మెళ్ళో కట్టు బావయ్య
మూడు ముళ్ళు మెళ్ళో కట్టు బావయ్య
ఎల్లు ఎల్లు ఎల్లు ఎల్లు
ఎల్లయ్య బావ ఎల్లయ్య బావ ఏసో ఓహో
ఎండ కొట్టే ఒల్లే మండే బావయ్య
ఎండ కొట్టే ఒళ్ళు మండే బావయ్య
ఎండ కొట్టే ఒళ్ళు మండే బావయ్య
Song Credits:
పాట: ఎల్లయ్య బావ ఏసో (Ellayya Bava Eso)
నిర్మాత – దర్శకత్వం : సింహాద్రి దుర్గం (Simhadri Durgam)
గానం : ఆదిమల్ల గిరమ్మ (Adhimalla Giramma)
కోరస్ : సంధ్యా ధన (Sandhya Dhana)
సంగీతం: రాజు మల్ (Raju Mal)
నటీ: జాను లిరి (Janu lyri)
కొరియోగ్రాఫర్: రాజేష్ పైండ్ల (Rajesh Paindla)
Dj: మహేష్ చింతల్‌పురి (Mahesh chintalpuri)
ఎల్లయ్య బావ ఏసో సాంగ్ విశ్లేషణ:
“ఎల్లయ్య బావ ఏసో” డీజే ఫోక్ పాట గ్రామీణ జానపద సంగీతానికి డీజే బీట్‌లను మిళితం చేసిన ఎనర్జిటిక్ సాంగ్. ఆదిమల్ల గిరమ్మ శక్తివంతమైన గాత్రం, సంధ్యా ధన కోరస్ కలసి పాటకు ఒరిజినల్ ఫోక్ ఫీలింగ్ తెచ్చాయి. రాజు మల్ అందించిన సంగీతం డీజే మిక్సింగ్‌తో సమకాలీనతను చేరువ చేస్తూ, పాటను మాస్ యూత్‌కు ఎట్రాక్టివ్‌గా మార్చింది. బావ-మరదల సరదా సంభాషణలతో ఉండే వీభిన్నమైన లిరిక్స్ పాటకు ప్రత్యేక ఆకర్షణ.
పాటకు రాజేష్ పైండ్ల కొరియోగ్రఫీ అందించగా, జాను లిరి డాన్స్ & ఎక్స్‌ప్రెషన్స్ కీలకంగా నిలిచే అవకాశం ఉంది. గ్రామీణ నేపథ్యంలో విజువల్ ప్రెజెంటేషన్ ఉంటే, పాట మరింత జనాదరణ పొందొచ్చు. డీజే మహేష్ చింతల్‌పురి మిక్సింగ్ పాటను ట్రెండింగ్ లిస్టులో నిలిపేలా చేసే ఛాన్స్ ఉంది. మాస్ బీట్, ఫోక్ ఫీలింగ్, ఆకర్షణీయమైన డాన్స్ మూమెంట్స్ ఉంటే, ఈ పాట త్వరగా వైరల్ అయ్యే అవకాశముంది.
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.