Home » మా అందాల సిరి (Maa Andhaala Siri) సాంగ్ లిరిక్స్, పరదా (Paradha)

మా అందాల సిరి (Maa Andhaala Siri) సాంగ్ లిరిక్స్, పరదా (Paradha)

by Lakshmi Guradasi
0 comments
Maa Andhaala Siri Song Lyrics Paradha

మా అందాల సిరి పాట పరదా చిత్రానికి చెందినది, దీనికి గోపీ సుందర్ సంగీతం అందించగా, వనమాలి సాహిత్యం అందించారు. శ్రీ కృష్ణ, రమ్య బెహరా ఈ పాటను ఆలపించారు. అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత తదితరులు నటించిన ఈ సినిమా ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వంలో రూపొందింది.

Maa Andhaala Siri Song Lyrics in Telugu, Paradha

మా.. అందాల సిరి మీద పడానీకు ఏ కళ్ళు..
ఆ.. చిరునవ్వే పచ్చంగా ఉండాలి నూరేళ్లు..
వెయ్యాలి పరదాలు చెయ్యాలి సరదాలు..
అమ్మ నీ దీవెనలే తోడుంటే అంతే చాలు..
మా ఊరి పొలిమేర దాటవుగా సంతోషాలు..

ఆ మిల మిల మిల మెరుపల్లే
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

ఆ తల తల తల హరివిల్లే
మన ఎదురుగ నడిచెల్లే
ఆ కలగని మనసులు తుళ్లే

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాకుందోగా
ఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్క
ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగా
మా అందరి మధ్యకు అల్లరి సిగ్గుల మొగ్గ

ఆ దివి సిమన పుట్టిందా
దిగి నేలకు వచ్చిందా
ఈ ముంగిట విరబూసిందా
మా చిరు గుండెను తట్టిందా
గిలిగింతలు పెట్టిందా
పలు వింతలు చూపించిందా

రాముని మించిన రాయడే వస్తాడే
రాణిలా నీకొక్క పల్లకి తెస్తాడే

హేయ్ అందాల బంగారు లేడి పిల్ల
నా ముందుకొచ్చేది ఇంకా కల్లా
ఎందుకు లేవోయ్ పారాణి ఏత్తె
అమ్మడి చేతులో నువ్విక చిత్తే
అంతే.. నీ ఆటలు సాగవు అంతే

ఓ చప్పున మాయం అయిపోతావే
చక చక పరుగులు పెట్టిస్తావే
తూనీగల్లే నువ్వు తూరంటావే

ఆ మిల మిల మిల మెరుపల్లే
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

కోటి కవచాలల్లే నిన్ను ఇది కాయాలి
నేటి పరదా నీకు రేపటికి తోడవ్వాలి
దేవతల నీడల్లో నిన్ను నడిపించాలి
మన ఊరి వరాల తల్లి నీకు కావలి

గుండెలో ప్రేమకే లేవుగా పరదాలే
అందుకే నా మది నీకిలా పరిచాలే

ఓ నీ ప్రేమ ఎంతుండి ఏమి లాభం..
కన్నెత్తి చూసింది లేదు రూపం..

దాగుడుమూత దండాకోరు
పిల్లి వచ్చే ఎలక దాక్కొ
దాక్కొ దాక్కోవే పిల్ల దాక్కొ

అరె నీతో పందెం ఎంతటి చిక్కో
నువ్వే నన్నిక చెంతకు లాక్కో
చెంతకు లాక్కో నీ వద్దకు లాక్కో

ఆ మిల మిల మిల మెరుపల్లే
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

ఆ తల తల తల హరివిల్లే
మన ఎదురుగ నడిచెల్లే
ఆ కలగని మనసులు తుళ్లే

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాకుందోగా
ఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్క
ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగా
మా అందరి మధ్యకు అల్లరి సిగ్గుల మొగ్గ

అరెరే ఎక్కడ ఎక్కడ ఎక్కడ దాకుందోగా
ఏ చూపులకందని ఎత్తున చక్కని చుక్క
ఇంకా ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వస్తుందోగా
మా అందరి మధ్యకు అల్లరి సిగ్గుల మొగ్గ

ఆ మిల మిల మిల మెరుపల్లే
సిరులొలికెను మన పల్లె
చిరునగవుల సొగసరి వల్లే

ఆ తల తల తల హరివిల్లే
మన ఎదురుగ నడిచెల్లే
ఆ కలగని మనసులు తుళ్లే

Maa Andhaala Siri Song Lyrics in English, Paradha

Maa.. andhala siri midha padaaniku ye kallu..
Aa.. chirunavve pachchanga undaali noorellu..
Veyyaali paradaalu cheyyaali saradaalu..
Amma nee deevenale todu unte anthe chaalu..
Maa oori polimera daatavuga santhoshaalu..

Aa mila mila mila merupalle
Sirulolikenu mana palle
Chirunagavula sogasari valle

Aa tala tala tala hariville
Mana eduruga nadichelle
Aa kalagani manasulu thulle

Arere ekkada ekkada ekkada daakundoga
Ee choopulakandani etthuna chakkani chukka
Inkaa eppudu eppudu eppudu vastundoga
Maa andari madhyaku allari siggula mogga

Aa divi simana puttindaa
Digi neelaku vachindaa
Ee mungita viraboosindaa
Maa chiru gundenu thattindaa
Giliginthalu pettindaa
Palu vinthalu choopinchindaa

Ramuni minchina raayade vastaade
Raanila neekokka pallaki testaade

Hey andala bangaru lady pilla
Naa mundukocchedi inkaa kalla
Enduku levooy paarani yetthe
Ammadi chethulo nuvvika chitthe
Anthe.. nee aatalu saagavu anthe

O chapunna maayam ayipothaave
Chaka chaka paragulu pettisthaave
Thoonigalle nuvvu thoorantaave

Aa mila mila mila merupalle
Sirulolikenu mana palle
Chirunagavula sogasari valle

Koti kavachalalle ninnu idi kaayaali
Neti paradaa neeku repatiki todavaali
Devathala needallo ninnu nadipinchali
Mana oori varala thalli neeku kaavali

Gundelo premake levuga paradaale
Anduke naa madi neekila parichaale

O nee prema enthundi emi laabham
Kannethi choosindi ledu roopam

Daagudumootha dandaakoru
Pilli vacche elaka daakko
Daakko daakove pilla daakko

Are neetho pandem enthati chikko
Nuvve nannika chenthaku laakko
Chenthaku laakko nee vaddaku laakko

Aa mila mila mila merupalle
Sirulolikenu mana palle
Chirunagavula sogasari valle

Aa tala tala tala hariville
Mana eduruga nadichelle
Aa kalagani manasulu thulle

Arere ekkada ekkada ekkada daakundoga
Ee choopulakandani etthuna chakkani chukka
Inkaa eppudu eppudu eppudu vastundoga
Maa andari madhyaku allari siggula mogga

Arere ekkada ekkada ekkada daakundoga
Ee choopulakandani etthuna chakkani chukka
Inkaa eppudu eppudu eppudu vastundoga
Maa andari madhyaku allari siggula mogga

Aa mila mila mila merupalle
Sirulolikenu mana palle
Chirunagavula sogasari valle

Aa tala tala tala hariville
Mana eduruga nadichelle
Aa kalagani manasulu thulle

Song Credits:

చిత్రం – పరదా (Paradha)
పాట – మా అందాల సిరి (Maa Andhaala Siri)
సంగీతం – గోపీ సుందర్ (Gopi Sundar)
గాయకులు – శ్రీ కృష్ణ (Sri Krishna), రమ్య బెహరా (Ramya Behara)
సాహిత్యం – వనమాలి (Vanamali)
నటీనటులు: అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), దర్శన రాజేంద్రన్ (Darshana Rajendran), సంగీత (Sangitha) తదితరులు.
దర్శకుడు: ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula)

“మా అందాల సిరి” పాట విశ్లేషణ:

“పరాధ” చిత్రంలోని “మా అందాల సిరి” పాట హృదయాన్ని హత్తుకునే మాధుర్యంతో సంగీతప్రియులను ఆకట్టుకుంటోంది. శ్రీకృష్ణ, రమ్య బెహరా గాత్రంలో ఈ గీతం మధురంగా మెరిసిపోగా, వనమాలి రాసిన సాహిత్యం పాటకు గాఢమైన భావోద్వేగాన్ని అందిస్తుంది. గోపీ సుందర్ స్వరపరిచిన ఈ మెలోడీ, సంగీతంలోని నెమ్మదితనం మరియు భావోద్వేగాలను అద్భుతంగా మేళవిస్తుంది.

అనుపమ పరమేశ్వరన్, దర్శన రాజేంద్రన్, సంగీత ప్రధాన తారాగణంగా నటించిన ఈ పాట, వారి హావభావాలతో మరింత మనసును కదిలించేలా రూపుదిద్దుకుంది. ఆనంద మీడియా బ్యానర్‌పై ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రం, తన వినసొంపైన సంగీతంతో ప్రేక్షకులను మాయ చేస్తోంది. సంగీతాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ తప్పక ఆస్వాదించాల్సిన మధురమైన గీతమిది!

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

About us

మేము తెలుగు వారికోసం, తెలుగులో తెలుగుని చదివే వారి కోసం, వారికి తెలుగు మీద వున్నా అభిమానాన్ని చూపించడానికి ఒక అంతర్జాల విశ్లేషణ ప్రదేశమును సృష్టించినాము. అదే తెలుగు రీడర్స్ అను ఈ ప్రదేశములో మేము మీకు కావాల్సిన కథలు, విశ్లేషణలు, పాటల రచనలు (గేయ రచనలు), చూడవలసిన ప్రదేశాలు, తెలుసుకోవలసిన సాంకేతిక పరిజ్ఞానం, చలన చిత్ర విశేషాలతో ఈ మా తెలుగు రీడర్స్ ని నింపి వున్నాము. మీకు ఎటువంటి ఇబ్బందులు వున్నా మామ్మాల్ని సంప్రదించండి ప్రక్కన వున్నా అనుసంధాన అంతర్జాల వనరుని నొక్కండి. తెలుగు రీడర్స్ ని సంప్రదించండి.

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.