Home » ఇది ప్రేమేమో తెలుసా (IDI Prememo TELUSAA) Song Lyrics Ramu Rathod

ఇది ప్రేమేమో తెలుసా (IDI Prememo TELUSAA) Song Lyrics Ramu Rathod

by Lakshmi Guradasi
1.1K views
IDI Prememo TELUSAA Song Lyrics Ramu Rathod

తొలిసారి నిన్ను చూసిన క్షణమే
రంగుల హరివిల్లే… విరిసెనే
నీ నవ్వుల సవ్వడి వినగానే
ఈ లోకమే మురిసెనే

ఎవరే నువ్వు కలలోకొచ్చి
కవించావే కలిసిన క్షణమే
ఎదురుగా నువ్వు నిలబడి ఉంటే
మాటలు రాలేదే నాలో ఈ తడబాటెంటో

మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా
మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా

ఏ పని తలపెడుతున్న నీ మైకంలోనే మునిగేస్తున్న
ఏ దారిన నే వెళుతున్న నిన్నే ఎదురుగా నే కలగంటున్న

సీతాకోకల్లే చక్కిరులే పెడుతుంటే
తుమ్మెదల వాలి తుంటరిగా చేస్తుంటే
ఈ గాలి గంధంలా నీ పేరు పలికేనే
పుడమిపై చినుకుల నా మనసు తడిసేనే
నిజమా ఇది ఎప్పుడు తెలియని భావమే

మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా
మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా

నన్ను ఈ దూరం వేధిస్తున్న
నీ ఊహలోనే బతికేస్తున్న
ఆ దేవుడ్నే ప్రార్థిస్తున్నా
నిన్ను వరముగా నాకిమ్మంటున్న

బాపు బొమ్మల్లే మనసును దోచేస్తుంటే
సిరిమువ్వై నవ్వి మురిపెంగా చూస్తుంటే
ఆ నీలి మేఘంలో నీ రూపు మెరిసే
కడలిపై అలల నా ఉప్పొంగేనే
చెలియా ఇది ఎప్పుడు చూడని హాయిలే

మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా
మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా

మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా
మనసా ఓ మనసా ఇది ప్రేమేమో తెలుసా
బహుశా పడిపోయానే నీ ప్రేమలో మనసా

Song Credits:

సాంగ్ : ఇది ప్రేమేమో తెలుసా (IDI Prememo TELUSAA)
నటీనటులు: రాము రాథోడ్ (Ramu Rathod), దీపికా పటేల్ (Deepika Patel)
సంగీతం & గాయకుడు: అంజి పమిడి (ANJI PAMIDI)
మహిళా గాయని: తేజు రావు (Teju Rao)
సాహిత్యం: గుర్రపు ఆంజనేయులు ముదిరాజ్ (GURRAPU ANJANEYULU MUDIRAJ)
నిర్మాత: గుర్రపు రేణుక ముదిరాజ్ (GURRAPU ANJANEYULU MUDIRAJ)
డాప్ ఎడిటింగ్ డైరెక్షన్: సాదిక్ ఎండి (Sadik Md)

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

Adblock Detected

Please support us by disabling your AdBlocker extension from your browsers for our website.