అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల..
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా
అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ..
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా…
అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల..
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా
అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ..
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా…
ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే
అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే..
అది ఒకే మాట అన్న భలే మిసిమి బంగరు మూట…
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న….
ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే
అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే..
అడివిని గుర్రమల్లె అట్టా తిరిగిన నన్నే
ఒక పువ్వులాగా పువ్వులాగా మార్చివేసింది..
పడకలో తొంగుంటేనే నా కలలే చెరిగే…
ఆమె సోయగాలు నవ్వి పోయే ముత్యం లాగా
ఏదో ఇద్దరినిట్ట ఇంతగా కలిపే చక్క ..
ఓ దాగుడుమూత ఆటలెన్నో ఆడిపాడామె
కళ్ళకు గంతలు కట్టి చేతులు చాచి
నీకై నేనే వెతుకుతూ ఉన్న… తనుగా ఏవైపెల్లిందో.
తనుగా ఏ వైపెల్లిందో.. తనుగా ఏవైపెల్లిందో…
అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల..
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా
అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ..
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా…
బతుకే రాట్నం లేరా తెగ తిరుగును లేరా
అది పైనాకింద పైనాకింద అవుతది కదరా..
మొదట పైకెగిరాను నే బోర్లాపడ్డ…
కొర్రమీను మల్లెమడుగు విడిచి తన్నుకు చచ్చా….
ఎవరో కూడ వస్తారు ఎవరో విడిచిపోతారు
అది ఎవరు ఎందుకన్నది మన చేతులో లేదే..
వెలుగుల దేవత ఒకతె ఏదనే కలవర పరిచి…
ఏదో మాయం చేసి… తానే ఏమైపోయిందో.
తానే ఏమైపోయిందో.. తానే ఏమైపోయిందో…
అదే నన్నే నన్నే చేరవచ్చే చంచలా
ఆమె లేతపచ్చ తమలపాకు వన్నెల..
అబ్బ సొగసు తెలుపమాట కూడ పలకలా
అరె ఇప్పుడే ఇప్పుడే తెచ్చిపెట్టు చంచలా ..
అది లేనినాడు నిప్పుసెగలు గుండెలా…
ఆ ఒక్కగాను ఒకతె నా గుండెల్లోనా నిండే
అరె కొంచం కొంచం తానే నన్ను పీల్చి పిప్పి చేసే..
అది ఒకే మాట అన్న భలే మిసిమి బంగరు మూట…
ఇప్పుడెంత మొత్తుకున్నా అది మరలి రాదురన్న….
Song Credits:
పాట పేరు – అదే నన్నే (Adhey nanne)
చిత్రం – సూర్య S/o కృష్ణన్ (Surya S/o Krishnan)
గాయకులు – కార్తీక్ (Karthik) & వి.వి. ప్రసన్న (V.V. Prassanna)
సంగీతం – హారిస్ జయరాజ్ (Harris Jayaraj)
సాహిత్యం – వేటూరి సుందరరామ మూర్తి (Veturi Sundararama Murthy)
దర్శకుడు – గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon)
నటీనటులు – సూర్య (Suriya),
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.