గుడి గంట సప్పులు మన ప్రేమ గురుతులు
పడిగాపులే కాస్తు నా కంటి సూపులు
ఎదురు చూస్తూ ఉన్నాయే
పిల్ల నీ చెంత చేరాలని
ఈ పొద్దు నన్నింకా కంగారు పెట్టొద్దు
పనిగట్టుకొని ఇంకా ప్రాణాలు తియ్యొద్దు
ముద్దంటూ సరసంగానే చేరి నన్నిట్ఠా విసిగించకు
ఆగమ్మ ఆగరాదే రాధమ్మ
బంగారు నా బొమ్మవే
సిత్రాల నా చిన్నివే రాధమ్మ
నా చిట్టి చిలకమ్మవే
ఆగితే ఎట్టాగయ్యో ఓ పిల్లగా
నన్నిట్ట ఏం చేస్తావో
నీ మాయ మాటాలతోటి
నన్నే మొత్తంగా బందిస్తావో
గుడి గంట సప్పులు మన ప్రేమ గురుతులు
పడిగాపులే కాస్తు నా కంటి సూపులు
ఎదురు చూస్తూ ఉన్నాయే
పిల్ల నీ చెంత చేరాలని
మురిపించే నీ నవ్వు
కవ్వించే నీ చూపు
నీ వైపుకే నన్ను లాగేసేనే
తనువంత పులకించి ఇవేళ మనసంత
గుండెల్లో గిలిగింత కలిగించెనే
నీ కౌగిలింతల్లో ప్రేమెంతో పొందాను
నీతోనే నేనై కలిసుంటిని
ఈ జన్మకే కాదు ప్రతి జన్మకి తోండంటూ
నా మనసుతో నీకు మటిస్తిని
నీ కంటి చూపుల్లో
కనుపాప నేనై లోకాన్ని చూపించనా
నీ కంటి చూపుల్లో
కనుపాప నేనై లోకాన్ని చూపించనా
బతికినన్నిన్నాళ్ళు నీ మేలు నే కోరి
నీవాడినై ఉండానా
నీ బతుకు నెన్నవ్వనా
ఈ పొద్దు నన్నింకా కంగారు పెట్టొద్దు
పనిగట్టుకొని ఇంకా ప్రాణాలు తియ్యొద్దు
ముద్దంటూ సరసంగానే చేరి నన్నిట్ఠా విసిగించకు
గుడి గంట సప్పులు మన ప్రేమ గురుతులు
పడిగాపులే కాస్తు నా కంటి సూపులు
ఎదురు చూస్తూ ఉన్నాయే
పిల్ల నీ చెంత చేరాలని
మనసున నా మనసు లేకుండా పోయిందే
కలవరింతల్లోన మునుగున్నదే
నిన్ను చూడకుండ క్షణమైన గడిపేది
ఎట్టాగంటు అలిగి కూసున్నదే
పది మందిలో నిన్ను పలకరించలేక
లోలోన తల్లడిపోతున్నాను
నిన్ను చూసి మురిసి తనివి తీర
నేను కూసింత సంబరపడిపోతిని
మన మధ్య ఎడబాటు ఊహించలేకుంటి
ఈ బాధ మనకెందుకే
మన మధ్య ఎడబాటు ఊహించలేకుంటి
ఈ బాధ మనకెందుకే
అన్ని తెలిసి కూడా మన ప్రేమ బంధాన్ని తెంచుకోమంటివే
రాధమ్మ నన్ను విడిచి ఎల్లకే…
గుడి గంట సప్పులు మన ప్రేమ గురుతులు
పడిగాపులే కాస్తు నా కంటి సూపులు
ఎదురు చూస్తూ ఉన్నాయే
పిల్ల నీ చెంత చేరాలని
ఈ పొద్దు నన్నింకా కంగారు పెట్టొద్దు
పనిగట్టుకొని ఇంకా ప్రాణాలు తియ్యొద్దు
ముద్దంటూ సరసంగానే చేరి నన్నిట్ఠా విసిగించకు
Song Credits:
దర్శకత్వం: శ్రీను.ఎవి (Srinu.AV)
నిర్మాత: హన్మ.బి (Hanma.B)
సంగీతం: వెంకట్ అజ్మీరా (Venkat Ajmeera)
సాహిత్యం: కళ్యాణ్ సుమిత్ర (Kalyan Sumithra)
గాయకులు: బొడ్డు దిలీప్ (Boddu Dileep), బట్టు శైలజ (Battu Shailaja)
నటీనటులు: లాస్య స్మైలీ (Lasya smily), హనుమంతు (Hanumanthu), శ్రీను ఎవి (Srinu AV), మాలతి (Malathi), వీర (veera)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.