రెండు కళ్ళు చాలవే నిన్ను చూడడానికి
ఎన్ని మాటలున్నా చాలవే నిన్ను పొగడడానికి
మంత్రమేసినావులే గుండె జారడానికి
ఎదో మాయ చేసినావులే నిన్ను చేరడానికి
మనసు నిండిపోయావే నిన్ను మరిచిపోలేనే
ఎంతో ఇష్టపడ్డానే నిన్ను వదులుకోలేనే
జాడలేని జాబిలమ్మా నవ్వుకుంటూ ఎదురుపడితే
ఊపిరాడుతుందేమోగా చూడాలే
ఒక్కసారి వచ్చెళ్లవే కంటనీరు దాచలేనే
ఒక్కసారి చెయ్యందిస్తే గుండెలోన దాచేస్తానే
ఒక్కసారి వచ్చెళ్లవే కంటనీరు దాచలేనే
ఒక్కసారి చెయ్యందిస్తే వంద ఏళ్ళు తోడుంటానే
అందమైన పొగరు నీది
అంతులేని ప్రేమ నాది telugureaders.com
చూడకుండా పోతూవుంటే ఎంతో బాధగున్నదే
చుక్కలోని చంద్రుడైనా మచ్చ లేని వాడా చెప్పు
లోపమంటూ లేనోడంటూ భూమి మీదనే లేడు
బొమ్మల్లే నువ్వు కనబడుతుంటే మైమరిచిపోతానే
రోజంతా నువ్వు కనబడకుంటే ఏమైపోతానో
ప్రేమలోన పడ్డవాడు అంత ప్రేమే అనుకుంటాడు
ఎవడెన్ని చెప్పినను నమ్మడే…
ఒక్కసారి వచ్చెళ్లవే కంటనీరు దాచలేనే
ఒక్కసారి చెయ్యందిస్తే గుండెలోన దాచేస్తానే
ఒక్కసారి వచ్చెళ్లవే కంటనీరు దాచలేనే
ఒక్కసారి చెయ్యందిస్తే వంద ఏళ్ళు తోడుంటానే
అందముండి లాభమేంటే
గుణము లేని బతుకు నీదే
నమ్మలేకపోతువున్నా అంత మాయగున్నదే
కళ్ళు ఉన్న గుడ్డివానై కలలు గన్నా నేనేంచేయనే
లవ్వు గివ్వు అంటేనే గాలిలోన దీపమే
అందంగా రోజు కనబడుతుంటే గాల్లో తేలానే
అందంలో ఏమి లేదురా బాబు బుద్ధుల్ని చూడాలే
బంధాలన్నీ వదులుకున్న స్నేహానికి దూరమైన
ఒక్కతోడు లేకపాయే ఈరొజే…
ఒక్కసారి వచ్చెళ్లవే కంటనీరు దాచలేనే
ఒక్కసారి చెయ్యందిస్తే గుండెలోన దాచేస్తానే
ఒక్కసారి వచ్చెళ్లవే కంటనీరు దాచలేనే
ఒక్కసారి చెయ్యందిస్తే వంద ఏళ్ళు తోడుంటానే
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
నిర్మాత: సంగం స్నేహశ్రీనివాస్ (Sangam Snehasrinivas)
దర్శకుడు & స్క్రీన్‌ప్లే: బాలు SM (Balu SM)
గాయకుడు: రామ్ అద్నాన్ (Ram Adnan)
నటీనటులు: పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar) & రామ్ అద్నాన్ (Ram Adnan)
లిరిక్స్ & డైలాగ్ రైటర్: హనుమయ్య బండారు (Hanumayya Bandaru)
సంగీత దర్శకుడు: నవీన్ జె (Naveen j)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.