Pacha Bottu Love Failure Song | Pooja Nageshwar Songs | Singer Ram Adnan
పచ్చబొట్టు పచ్చిపుండైతున్నదే..
నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు
కంటి పాప కన్నీరవుతున్నదే..
నిన్ను మనసారా పూజించినందుకు
గుండె ముక్కలు అయితున్నదే
నిన్నే నమ్మినందుకు
ప్రాణాలు పోతున్నాయే
నీ మోసాన్ని చూసినందుకు
పిచ్చోన్ని చేసినవే…
ప్రేమ పిచ్చోన్ని చేసినవే
పిచ్చోన్ని చేసినవే…
ప్రేమ పిచ్చోన్ని చేసినవే
ఒట్టేసి మాటిచ్చినవ్
నన్ను నడిమిట్ల ఇడిసేసినవ్
కడదాకా తోడుంటన్నావ్ telugureaders.com
కాలి దుమ్ముతో నన్ను పోల్చినవ్
మనసంత నువ్వేనన్నావ్
నన్ను మరిసెట్టా నువ్ పోయినవ్
మనసారా ప్రేమించినవ్
మంది మల్లె నన్ను చూసినవ్
నీ మెళ్ళో మూడు ముల్లే వెయ్యని
నా వెంటే నువ్ తిరిగినవ్
నన్నే ఇడిసి మన ప్రేమ మరిసి
దూరంగా నువ్వెళ్ళినవ్
పచ్చబొట్టు పచ్చిపుండైతున్నదే..
నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు
కంటి పాప కన్నీరవుతున్నదే..
నిన్ను మనసారా పూజించినందుకు
మనసే లేనిదాన అన్ని మాయ మాటలేనా
మోసపోతిన నిన్ను నమ్మి
సిన్నదాన కన్నీరు కార్చుతున్న
కనికరించావు మనిషివేనా
ప్రాణాలు పోతున్న పాపమానవా
వదిలేసి పోతావని తెలిసుంటే
ముందే చెప్పకపోతివే
ఊపిరి తీసి ఒంటరి చేసి
నవ్వుతూ నువ్వెళ్ళిపోతివే
పచ్చబొట్టు పచ్చిపుండైతున్నదే..
నిన్ను ప్రాణంగా ప్రేమించినందుకు
కంటి పాప కన్నీరవుతున్నదే..
నిన్ను మనసారా పూజించినందుకు
Note: మీరు చదువుతున్నది telugureaders.com పబ్లిష్ చేసిన లిరిక్స్.
Song Credits:
సాహిత్యం: సురేష్ కడారి (Suresh Kadari)
సంగీతం: కృష్ణుడు (Krishnudu)
గాయకుడు: రామ్ అద్నాన్ (Ram Adnan)
నటీనటులు: చిన్ను గాడు (Chinnu Gadu) & పూజా నాగేశ్వర్ (Pooja Nageshwar)
దర్శకత్వం: బాలు SM (Balu SM)
మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.