Home » ప్రేమా ఓ ప్రేమా  (Prema O Prema) సాంగ్ లిరిక్స్ | Jatha Kalise

ప్రేమా ఓ ప్రేమా  (Prema O Prema) సాంగ్ లిరిక్స్ | Jatha Kalise

by Lakshmi Guradasi
0 comments
Prema O Prema song lyrics Jatha Kalise

కన్నుల్లో కలలా మేరిసీ
అందాల కథలా కలిసి
వెళ్ళావు వదిలీ నన్నిలా

కన్నీటి కళలై కరగీ
గుచ్చేటి గురుతై మిగిలీ
ఉన్నావు యదలో నువ్విలా

తడి కన్నుల్లోనా నువ్వే
యెద గాయంలోనా నువ్వే
ఎటు చూస్తూ ఉన్నా నువ్వే
ప్రియతమా…

నా ప్రాణంలోనా నువ్వే
నా మౌణంలోనా నువ్వే
ఎటు అడుగేస్తున్నా నువ్వే
ప్రియతమా…

ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం
ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం
ప్రేమా ఓ ప్రేమా నిను కలవడం శాపమా

నువ్వు నిజమే నేను నిజమే
మనసు కలిపే చెలిమి గుణమే
మారిందిలా ఓ మాయలా
ఈ పెను యాతన చల్లారెనా
నను నవ్వించిందీ నువ్వే
నను కవ్వించిందీ నువ్వే
నను ఎడ్పిస్తుందీ నువ్వే
ప్రియతమా…

నా స్వాసల్లోనా నువ్వే
నడి ఆశల్లోనూ నువ్వే
నను చంపేస్తుందీ నువ్వే
ప్రియతమా…

ప్రేమా ఓ ప్రేమా అయిపోతున్నా దూరం
ప్రేమా ఓ ప్రేమా నాదేనంటావా నేరం
ప్రేమా ఓ ప్రేమా నిను కలవడం శాపమా

ప్రేమ వరమే ప్రేమ మనమే
మనసులోనీ ఆశ నిజమే
చెప్పేదెలా నీతో ఇలా
నాలోని స్పందనా క్షమాపనా
నా నీడై ఉందీ నువ్వే
నను వెంటాడిందీ నువ్వే
నా చుట్టూ ఉందీ నువ్వే
తెలుసునా…

నను కదిలించిందీ నువ్వే
నను కరిగించిందీ నువ్వే
నా లోకం మొత్తం నువ్వే
తెలుసునా…ప్రేమా ఓ ప్రేమా
నువులేని నేనే శూన్యం
ప్రేమా ఓ ప్రేమా
నీకోసం వెతికే ప్రాణం
ప్రేమా ఓ ప్రేమా
నిను మరువడం సాద్యమా…

మరిన్ని ఇటువంటి లిరిక్స్ కోసం తెలుగు రీడర్స్ లిరిక్స్ ను చూడండి.

You may also like

Leave a Comment

@2025 – All Right Reserved. Designed and Developed by MrPKP.